భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్‌ను షియోమీ శాసిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లున్న మోడళ్లను అందుబాటులోకి తీసుకురావడం కారణంగా షియోమీ ఫోన్లకు డిమాండ్ భారీగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో షియోమీ 23.6 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు విక్రయించింది. ఈ గణాంకాలు చూస్తే.. షియోమీకి ఉన్న ఆదరణ అర్థమవుతుంది.
ఇందుకోసం ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ వినియోగదార్లను ఆకర్షిస్తోంది షియోమీ. ఇందులో భాగంగా జూలై4న మరో బడ్జెట్ ఫోన్ 'రెడ్మీ7ఏ'ను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది ఈ స్మార్ట్ ఫోన్ దిగ్గజం.
ఈ మేరకు షామీ ఇండియా ఎండీ మను కుమార్ జైన్ ట్వీట్ చేశారు. 'రెడ్ మీ 7ఏ'లో వాడిన ప్రాసెసర్‌ను ఆయన హైలెట్ చేశారు.