టెక్నాలజీ పుణ్యాన రవాణా వ్యవస్థలో క్యాబ్‌లు ఇప్పుడు కీలకంగా మారాయి. నగరాల్లో క్యాబ్‌లకు యమా డిమాండ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ టాక్సీ సేవలు ఏ ధరకు లభిస్తున్నాయో అధ్యయనం చేసింది టాక్సీ2ఎయిర్పోర్ట్.కామ్. ఈ లెక్కలు తెలుసుకునేందుకు టాక్సీ-కాలిక్యులేటర్.కామ్ డేటాను విశ్లేషించింది.
1. ఈజిప్ట్
ఈజిప్ట్‌లో టాక్సీ ధరలు నియంత్రణలో ఉన్నాయి. ఇక్కడ 5 కిలోమీటర్ల ప్రయాణానికి గరిష్ఠంగా రూ. 66 (0.84 యూరోలు) వసూలుచేస్తారు. కనీస ధర 0.24 యూరోలు మాత్రమే కావడం గమనార్హం.
ఈజిప్ట్‌లో నియంత్రణలోనే క్యాబ్ ధరలు 2. భారతదేశం
భారతదేశంలో 5 కిలోమీటర్ల క్యాబ్ ప్రయాణానికి సుమారు రూ. 102 వసూలు చేస్తారు. ముంబయి, దిల్లీ వంటి నగరాల్లోనే ఇది అధికంగా ఉంటుంది.
భారత దేశంలో 5కి.మీ. క్యాబ్ ప్రయాణానికి రూ. 102 3. థాయ్‌లాండ్
థాయ్‌లాండ్‌లో 5 కి.మీ. దూరం వెళ్లడానికి రూ.112 (1.41 యూరోలు) చెల్లించాల్సి ఉంటుంది. 5 కి.మీ. క్యాబ్ ప్రయాణానికి ఇది తగిన ధర అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
థాయ్‌లాండ్‌లో 5 కిమీ ప్రయాణానికి రూ. 112 4. జర్మనీ
జర్మన్ వీధుల్లో 5కి.మీ. క్యాబ్‌లలో తిరగాలంటే 13.80 యూరోలు వసూలు చేస్తారు.
5. జపాన్
స్విట్జర్లాండ్ తర్వాత క్యాబ్ ప్రయాణాలకు ఎక్కువ ధర వసూలుచేస్తున్న దేశం జపాన్. ఇక్కడ 5 కిలోమీటర్ల ప్రయాణానికి ధర రూ. 1180 (15.64యూరోలు) చెల్లించాలి.
జపాన్‌లో క్యాబ్ ప్రయాణానికి 5కి.మీ.లకు రూ.1180 చెల్లించాల్సిందే 6. స్విట్జర్లాండ్
స్విట్జర్లాండ్‌లో క్యాబ్ ప్రయాణం అత్యంత ఖర్చుతో కూడుకున్నది. ఇక్కడ క్యాబ్‌లో వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే. 5 కి.మీ. దూరానికి క్యాబ్‌కు రూ. 1800(22.68) వెచ్చించాల్సిందే.
స్విట్జర్లాండ్‌లో క్యాబ్ ప్రయాణానికి అధిక మొత్తం చెల్లించాలి