అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. విదేశీ మార్గాలతో సహా 52 విమానాల్లో మొత్తం మహిళా సిబ్బందితో సేవలందించనున్నట్లు ప్రకటించింది సంస్థ.
ఉమెన్స్ డే ప్రత్యేకం: ఆ విమానంలో సిబ్బందంతా మహిళలే - AIR INDIA LATEST NEWS
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా.. ఉమెన్స్ డే సందర్భంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 50 విమానాల్లో కేవలం మహిళా సిబ్బందితో సేవలందించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

ఉమెన్స్ డే ప్రత్యేకం: ఆ విమానంలో సిబ్బందంతా మహిళలే
మహిళా శక్తికి ప్రతీకగా.. ఎయిర్ ఇండియాలోని కాక్పిట్, కేబిన్ సిబ్బంది విమానాల్లో విధులు నిర్వహిస్తారని ఆ సంస్థ తెలిపింది. మహిళా ఉద్యోగులతో దేశీయ, అంతర్జాతీయ విమానాలను నడుపుతున్న ఏకైక విమానయాన సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది ఎయిర్ ఇండియా.