తెలంగాణ

telangana

ETV Bharat / business

క్యూ3 లాభాల్లో విప్రో 21%, ఇన్ఫీ 16.6% వృద్ధి - ఇన్ఫోసిస్ క్యూ3 ఆదాయం

2020-21 మూడో త్రైమాసికంలో విప్రో లాభం 21 శాతం పెరిగింది. ఇదే సమయంలో దేశీయ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కూడా రూ.5,197 కోట్ల లాభాన్ని గడించింది.

Wipro profit jump 21 pc
భారీగా పెరిగిన విప్రో లాభం

By

Published : Jan 13, 2021, 4:24 PM IST

Updated : Jan 13, 2021, 5:26 PM IST

దేశీయ ఐటీ దిగ్గజం విప్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి (క్యూ3) రూ.2,968 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో గడించిన రూ.2,456 కోట్లతో పోలిస్తే ఇది 20.8 శాతం అధికం.

ఆదాయం కూడా క్యూ3లో రూ.15,670 కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది విప్రో. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ ఆదాయం రూ.15,470.5 కోట్లుగా తెలిపింది.

క్యూ3లో ఐటీ ఉత్పత్తుల ద్వారా రూ.160 కోట్లు, భారత ప్రభుత్వాధీన సంస్థల వ్యాపారాల ద్వారా రూ.240 కోట్ల ఆదాయాన్ని గడించినట్లు విప్రో వెల్లడించింది.

ఒక్కో షేరుకు రూ.1 డివిడెండ్ ఇస్తున్నట్లు విప్రో ప్రకటించింది.

ఇన్ఫీ లాభం రూ.5,197 కోట్లు..

దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్​ కూడా 2020-21 క్యూ3కి గాను రూ.5,197 కోట్ల లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే సమయంతో పోలిస్తే.. సంస్థ లాభం 16.6 శాతం పెరిగినట్లు తెలిపింది. 2019-20 క్యూ3లో ఇన్ఫోసిస్ లాభం రూ.4,457 కోట్లుగా పేర్కొంది.

2020 డిసెంబర్​తో ముగిసిన మూడు నెలల కాలానికి సంస్థ ఆదాయం రూ.23,092 కోట్ల నుంచి.. రూ.25,927 కోట్లకు (12.3 శాతం వృద్ధి) పెరిగినట్లు వివరించింది.

ఇదీ చూడండి:రూ.89కే అమెజాన్ ప్రైమ్ సబ్​స్క్రిప్షన్​!

Last Updated : Jan 13, 2021, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details