ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో.. దేశీయ ఐటీ దిగ్గజం 'విప్రో' రూ.2,465.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. 2019-20 క్యూ2లో నమోదైన రూ.2,552.7 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 3.4 శాతం తక్కువ.
2020-21 జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో సంస్థ ఆదాయం మాత్రం.. గత అర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే రూ.15,114.5 కోట్ల వద్ద దాదాపు ఫ్లాట్గా ఉంది.