తెలంగాణ

telangana

ETV Bharat / business

టాప్​ 20లో 'విప్రో' అవుట్​.. 'డీమార్ట్​' ఇన్​ - Wipro share value

మార్కెట్​ విలువ (ఎం క్యాంప్​) పరంగా విప్రో మరో ర్యాంకు కోల్పోయింది. అత్యధిక మార్కెట్ విలువ కలిగిన టాప్​ 20 కంపెనీల్లో 20వ స్థానానికి సూపర్​ మార్కెట్ల నిర్వహణ సంస్థ డీమార్ట్​ (అవెన్యూ సూపర్​మార్ట్స్ లిమిటెడ్​​) విప్రో స్థానాన్ని కైవసం చేసుకుంది. విప్రో మరో స్థానం దిగజారి 21వ స్థానానికి పడిపోయింది.

wipro
విప్రో

By

Published : Feb 5, 2020, 10:20 PM IST

Updated : Feb 29, 2020, 8:14 AM IST

దేశీయ కంపెనీల్లో ఐటీ దిగ్గజం విప్రో ర్యాంకు మరింత తగ్గింది. మార్కెట్​ విలువ (ఎం క్యాంప్) పరంగా దేశ వ్యాప్తంగా 20 టాప్​ కంపెనీల జాబితాలో విప్రో చోటు కోల్పోయింది. ఈ జాబితాలో సూపర్ మార్కెట్ సంస్థ 'డీమార్ట్'(అవెన్యూ సూపర్​ మార్ట్స్​ లిమిటెడ్) చోటు దక్కించుకుంది.

మారిన లెక్కలు..

ఇవాళ స్టాక్​ మార్కెట్లు ముగిసిన తర్వాత.. బీఎస్​ఈలో డీమార్ట్​ ఎం క్యాప్​ రూ.1,41,205.36 కోట్లకు చేరింది. ఇదే సమయానికి విప్రో ఎం క్యాంప్​ రూ.1,38,428,33 కోట్లుగా ఉంది. విప్రో కన్నా రూ.2,777.03 కోట్లు అధిక విలువతో.. డీమార్ట్​ టాప్​ 20 కంపెనీల్లో చోటు దక్కించుకుంది. విప్రో 21 స్థానంతో సరిపెట్టుకుంది.

డీ మార్ట్ వృద్ధి ఇలా..

డీమార్ట్​ సూపర్​ మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్​ మార్ట్స్​ 2017 మార్చి 21 నుంచి ఎక్స్ఛేంజీల్లో ట్రేడవుతోంది. ఈ సంస్థ షేరు నేడు 4.35 శాతం పెరిగింది. ప్రస్తుతం రూ.2249.30 వద్ద ఉంది. ఎక్స్ఛేంజీల్లో నమోదైనప్పటి నుంచి ఇప్పటివరకు సంస్థ షేరు 251 శాతం వృద్ధి చెందింది.

దేశీయ దిగ్గజాలు ఇవే..

దేశీయ కంపెనీల్లో ప్రస్త్తుతం రూ.9,17,953.13 కోట్ల ఎం క్యాంప్​తో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో టీసీఎస్​ రూ.8,04,980.33 కోట్లతో టీసీఎస్ నిలిచింది.

ఇదీ చూడండి:వజ్రాల వ్యాపారంపై కరోనా పడగ-రూ.8వేల కోట్ల నష్టం!

Last Updated : Feb 29, 2020, 8:14 AM IST

ABOUT THE AUTHOR

...view details