తెలంగాణ

telangana

ETV Bharat / business

'రోల్స్ రాయిస్' కారు.. అందరికీ అమ్మరు - rolls royce most expensive car price in india

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన 'రోల్స్​రాయిస్​' గురించి తెలుసుకుంటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ కారును ఎవరికి పడితే వాళ్లకు అమ్మరు. అవునా అని అవాక్కయ్యారా? దీని వెనకున్న కారణం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

rolls royce car
రోల్స్ రాయిస్

By

Published : Aug 22, 2021, 8:29 AM IST

నిజమే.. 'మాకు డబ్బు కన్నా కారే ముఖ్యం' అనే ప్రమాణాన్ని మొదటినుంచీ పాటిస్తున్న రోల్స్ రాయిస్ సంస్థ అడిగిన వాళ్లందరికీ తమ కారును అమ్మదు. కారును బుక్ చేసుకున్న కస్టమరు వ్యక్తిగత ప్రొఫైల్, సమాజంలో అతని స్థాయి, దాన్ని నడపబోయే డ్రైవరు వివరాలు.. ఇలా అన్నింటినీ చూస్తుంది. అందుకే ఈ కారు కొనాలంటే డబ్బుతోపాటూ అదృష్టం కూడా ఉండాలని అంటారు. సాధారణంగా కార్లన్నీ కొన్ని ప్రాథమిక రంగులూ, వాటి షేడ్లలోనే ఉంటాయి. కానీ రోల్స్ రాయిస్ మాత్రం 44,000 షేడ్స్ వస్తుంది. అంతేనా, ఎవరైనా వినియోగదారుడు ఒక రంగును వేయించుకుంటే దాన్ని అతని పేరుమీద రిజిస్టర్ చేస్తుంది.

ఒకవేళ ఇంకెవరైనా ఆ రంగును వేయించుకోవాలని ఆశపడితే రిజిస్టర్ అయిన కారు ఓనరు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ అనుమతి లభించాక ఏదో ఒక షోరూంలో రంగును మార్పించుకోవచ్చనుకుంటే పొరపాటే. సదరు వినియోగదారుడు ప్రపంచంలో ఎక్కడున్నా సరే.. సంస్థే తమ ఉద్యోగిని వాళ్లుండే చోటుకు పంపి రంగు వేయిస్తుంది.

రోల్స్ రాయిస్ కారు

ఈ కారును బాగా గమనిస్తే.. దీనిపైన చాలా సన్నని గీత ఉంటుంది. సంస్థ ఆ గీత గీయాలని నిర్ణయించుకున్నప్పటినుంచీ మార్క్ కోర్ట్ అనే వ్యక్తే ఆ పని చేస్తున్నాడట. ఒకప్పుడు వీధి గోడలపైన బొమ్మలు వేసిన మార్కెట్ రోల్స్ రాయిస్ కంపెనీలో చేరాక ఆ గీత గీయడం తప్ప మరో పని చేయడట. పైగా కారు మొత్తం తయారయ్యాక మాత్రమే ఆ గీతను గీస్తారు. కాబట్టి మార్క్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడట. ఇందుకోసం అతను ఉడుత వెంట్రుకలతో స్వయంగా బ్రష్ను తయారుచేసుకుని మరీ వాడతాడు. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే రోల్స్ రాయిస్ అంటే... అంత క్రేజ్ మరి!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details