ఈ ఏడాది చివరినాటికి భారత యూజర్లందరికి పేమెంట్ సేవలు అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్. సంస్థ అంతర్జాతీయ అధిపతి విల్ క్యాత్‌కర్ట్ ఈ విషయాన్ని వెల్లడించారు. భారత పర్యటనలో ఉన్న ఆయన పలు విషయాలను యూజర్లతో పంచుకున్నారు.
వాట్సాప్‌నకు భారత్‌లో 400 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. దాదాపు 10 లక్షల యూజర్లపై ఏడాది కాలంగా పేమెంట్ సేవల ట్రయల్ నిర్వహిస్తోంది.
వాట్సాప్‌లో సందేశాలు ఎంత సులభంగా పంపగలుగుతారో అంతే సులభంగా లావాదేవీలు జరిపేలా చేయడమే కంపెనీ లక్ష్యమని క్యాత్‌కర్ట్ పేర్కొన్నారు.
"ఈ లక్ష్యాన్ని విజయవంతంగా అందుకోగలిగితే ఆర్థిక లావాదేవీలు భారీగా పెరుగుతాయి. భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్ లావాదేవీలకు ఇది మరింత తోడ్పడుతుంది."
-విల్ క్యాత్‌కర్ట్, వాట్సాప్ అంతర్జాతీయ అధిపతి
పేమెంట్ దిగ్గజాలకు పోటీ