తెలంగాణ

telangana

ETV Bharat / business

5 కోట్ల అంకురాలకు వాట్సాప్ ప్రోత్సాహం! - అంకురాలకు ప్రోత్సాహం

దేశంలో 50 మిలియన్ల చిన్న, మధ్య తరహా సంస్థల అభివృద్ధికి ప్రోత్సాహమందించేందుకు సిద్ధమైంది 'వాట్సాప్'. అంకురాల కోసం ఆవిష్కరించిన 'వాట్సాప్ బిజినెస్ యాప్​' కార్యాకలాపాల విస్తరణలో భాగంగా ఈ కార్యక్రమానికి పూనుకుంది.

వాట్సాప్

By

Published : Jul 23, 2019, 6:00 PM IST

భారత్​లో 50 మిలియన్ల చిన్న, మధ్య తరహా అంకురాలకు ప్రోత్సాహమందించే దిశగా 'వాట్సాప్' అడుగులు వేస్తోంది. ఐదు ఉత్తమ భారత అంకుర సంస్థలకు రూ.35 లక్షల చొప్పున ప్రోత్సాహం అందించనున్నట్లు ప్రకటించింది 'వాట్సాప్'.

వాట్సాప్ నూతన అధినేత విల్ క్యాత్​కర్ట్ భారత పర్యటనలో భాగంగా గురువారం అంకురాల ప్రోత్సహకాలపై కీలక ప్రకటన చేయనున్నారు.

'గేట్ వే టు బిలియన్ ఆపర్చునిటీస్' పేరుతో గురువారం ఓ సమావేశాన్ని నిర్వహించనున్నారు విల్​ క్యాత్​కర్ట్​. ఇందులో నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ కూడా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలోనే చిన్న, మధ్య తరహా అంకురాలకు సంబంధించిన ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉంది.

గత ఏడాది జనవరిలో ఆవిష్కరించిన ' వాట్సాప్​ బిజినెస్ యాప్'​పై ప్రస్తుతం భారీ ఎత్తున కసరత్తు చేస్తోంది ఈ సంక్షిప్త సందేశాల దిగ్గజం. చిన్న, మధ్య తరహా అంకురాలకు, వాటి వినియోగదారులకు పరస్పర సమాచార మార్పిడి కోసం ఈ యాప్​ను తీసుకువచ్చింది వాట్సాప్.

అంకురాలతో చర్చలు

వాట్సాప్​ నుంచి చిన్న, మధ్య తరహా అంకురాలకు ఎలాంటి మార్గదర్శకాలు అవసరం అనే అంశంపై ముంబయిలో ఓ కార్యక్రమం నిర్వహించనున్నారు విల్​ క్యాత్​కర్ట్. ఇందులో పలు చిన్న, మధ్య తరహా అంకురాల ప్రతినిధులతో చర్చించనున్నారు.

ఒక సాధారణ డెవలపర్​ నుంచి దిగ్గజ సంస్థల్లో ఒకటైన 'వాట్సాప్' అధినేతగా ఎదిగిన క్యాత్​కర్ట్ తన అనుభవాలను పంచుకోనున్నారు.

ఇదీ చూడండి: 'ఉల్లంఘన' కేసులో అనిల్​ అంబానీకి ఊరట

ABOUT THE AUTHOR

...view details