సంక్షిప్త సందేశ దిగ్గజం వాట్సాప్ మరో కీలక మైలురాయిని దాటింది. ప్రపంచవ్యాప్తంగా 25 శాతం మంది (200 కోట్ల మంది) వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు.
2018 ఫిబ్రవరిలో వాట్సాప్ వాడే నెలవారీ యూజర్ల సంఖ్య 1.5 బిలియన్లు (150 కోట్లు)గా ఉన్నట్లు మాతృ సంస్థ ఫేస్బుక్ సీఈఓ మార్క్ జూకర్బర్గ్ తెలిపారు. అత్యధికంగా భారత్‌లో 400 మిలియన్ల మంది వాట్సాప్‌ను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. అ తర్వాత రెండేళ్లకే మరో ఆర బిలియన్ మంది యూజర్లు వాట్సాప్ వినియోగించే జాబితాలో చేరడం విశేషం.