సంక్షిప్త సందేశాల దిగ్గజం వాట్సాప్ మరో అధునాతన ఫీచర్‌ను తీసుకురానుంది. వాట్సాప్ యూజర్లు అవతలి వ్యక్తికి పంపే సందేశాలు కొంత సేపటి తర్వాత వాటంతటవే డిలీట్ అయ్యేలా ఈ ఫీచర్ పనిచేస్తుందని ఓ టెక్ వార్తా సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగదశలో ఉందని తెలిపింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ బీటా వీ2.19.275 వెర్షన్లో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది వాట్సాప్.
కొత్త ఫీచర్ ఎలా పని చేస్తుందంటే...
ఒక వాట్సాప్ యూజర్ మరో వాట్సాప్ యూజర్‌కు సందేశాలు పంపే ముందు తన మెసేజ్ అవతలి వ్యక్తికి ఎంత సేపు కనిపించాలి అనేది ముందుగానే నిర్ణయించొచ్చు. ఇలా ఈ ఫీచర్‌ను ఉపయోగించి పంపిన సందేశాలు 5 సెకన్ల నుంచి గంట వ్యవధిలో వాటంతట అవే డిలీట్ అవుతాయి. తాత్కాలిక అవసరాలకు పంపే సందేశాలకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడనుంది.