వాట్సాప్ యూజర్లు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డార్క్ మోడ్ ఫీచర్ ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ బీటా యూజర్లు మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించుకునే వీలుంది.
ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ వినియోగిస్తున్న బీటా యూజర్లు యాప్‌ను 2.20.13 వెర్షన్‌కు అప్డేట్ చేసుకోవడం ద్వారా డార్క్‌మోడ్ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు.
ఆండ్రాయిడ్‌లో సాధారణ యూజర్లకు త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.