ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున చాలా దేశాల్లో లాక్డౌన్ విధించారు. ఈ కారణంగా కోట్లాది మంది ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా ఇళ్లలో ఉంటున్నవారు తమకు ఇష్టమైన వారితో మాట్లాడేందుకు గ్రూప్ వీడియో కాల్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వినియోగదార్లకు శుభవార్త వినిపించింది వాట్సాప్. ఇకపై ఒకేసారి 8 మందితో వాయిస్ కాల్ లేదా వీడియో కాల్ చేసి మాట్లాడవచ్చని ఈ ఫేస్బుక్ అనుబంధ సంస్థ తెలిపింది.
"కరోనా నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వాట్సప్ ద్వారా వాయిస్ లేదా వీడియో కాల్ చేయడం బాగా పెరిగింది. మరింత ఎక్కువ మందితో మాట్లాడే అవకాశం కావాలని వినియోగదార్ల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. గతంలో ఉన్న గ్రూప్ వాయిస్, వీడియో కాల్ పరిమితిని రెట్టింపు చేశాం."
-వాట్సాప్ ప్రకటన
ఇలా పొందండి..