భారత ఈ-కామర్స్ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్, జియోమార్ట్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్...ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్‌లో 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వాల్‌మార్ట్ తెలిపింది. రెండేళ్ల క్రితం 16 బిలియన్ డాలర్ల విలువైన మెజారిటీ వాటాను 24.9 బిలియన్ డాలర్ల పోస్ట్ మనీగా వాల్ మార్ట్ కొనుగోలు చేసింది. అప్పుడు ఫ్లిప్‌కార్ట్ విలువ 20.8 బిలియన్ డాలర్లుగా ఉంది.
దేశంలోని 20 కోట్ల దుకాణదారులను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. రిటైల్ రంగంలో దూసుకుపోతున్న జియోమార్ట్‌ను ఎదుర్కొనేందుకు ఫ్లిప్‌కార్ట్ మూలధన సమీకరణను మరింతగా పెంచుకుంటోంది.