తెలంగాణ

telangana

ETV Bharat / business

యాపిల్​ వాచ్​ల్లోనూ వొడాఫోన్​ సెల్యూలర్ సేవలు - వోడాఫోన్ ఐడిాయా వార్తలు

యాపిల్​ వాచ్​లకు సెల్యూలర్​ సదుపాయాన్ని ప్రారంభించింది వొడాఫోన్​ ఐడియా. ఐఫోన్​తో పాటు స్మార్ట్​వాచ్​లోనూ ఒకే నంబరుతో సేవలు అందిస్తుంది. అయితే కొన్ని సర్కిళ్లలోనే ఈ సేవలను ప్రారంభించగా.. త్వరలోనే మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని తెలిపింది.

BIZ-VIL-APPLE WATCH
వోడాఫోన్​

By

Published : Jun 13, 2020, 6:01 AM IST

యాపిల్​ వాచ్​ల్లో శుక్రవారం నుంచి సెల్యూలర్ సేవలను ప్రారంభించింది వొడాఫోన్​ ఐడియా. అయితే కొన్ని ఎంపిక చేసిన సర్కిళ్లలోనే ఈ సెల్యూలర్​, జీపీఎస్​ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు స్పష్టం చేసింది.

"ఈ సదుపాయంతో వినియోగదారులు ఫోన్​ అవసరం లేకుండానే యాపిల్​ వాచ్​ను ఉపయోగించుకోవచ్చు. ముంబయి, దిల్లీ, గుజరాత్​ సర్కిళ్లలో శుక్రవారం నుంచి సెల్యూలర్​ సేవలు ప్రారంభించాం. ప్రస్తుతానికి ఈ సదుపాయం వొడాఫోన్​ పోస్ట్​పెయిడ్​ వినియోగదారులకే అందుబాటులోకి తెచ్చాం. మరికొన్ని రోజుల్లో మరిన్ని సర్కిళ్లకు పెంచుతాం. "

- వొడాఫోన్​ ఐడియా

ఈ రోజుల్లో వినియోగదారులు అనుసంధాన ఉత్పత్తులపై ఆసక్తి చూపిస్తున్నారు. సెల్యూలర్ సపోర్ట్ ద్వారా ఐఫోన్​లో ఉపయోగిస్తున్న నంబరునే యాపిల్​ వాచ్​లో వాడుకోవచ్చని వొడాఫోన్​ ఐడియా మార్కెటింగ్ డైరెక్టర్​ అన్వేష్ ఖోస్లా తెలిపారు. దీని ద్వారా యాపిల్​ వాచ్​ను స్వతంత్రంగా వినియోగించవచ్చని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details