టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో యూజర్ల సంఖ్య మరింత పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 62.57 లక్షల మంది కొత్తగా జియో నెట్‌వర్క్‌ను ఎంచుకున్నారు. ఇదే సమయానికి మరో టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా 34.67 లక్షల మంది వినియోగదారులను కోల్పోయింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని తెలిపాయి.
ఫిబ్రవరి గణాంకాలు ఇలా..
ఫిబ్రవరి నాటికి దేశంలో మొబైల్, ల్యాండ్‌ఫోన్ చందాదార్ల సంఖ్య 118 కోట్లుగా ఉంది. ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఇది 0.32 శాతం అధికం. ఇందులో 2జీ, 3జీ, 4జీ మొబైల్ కనెక్షన్ల సంఖ్య 116 కోట్లు. జనవరి కంటే ఇది 0.36 శాతం ఎక్కువ.
కంపెనీ | చందాదారుల్లో మార్పు | మొత్తం యూజర్లు | మార్కెట్ వాటా |
జియో | +62.57 లక్షలు | 38.28 కోట్లు | 32.99 శాతం |
ఎయిర్టెల్ | +9.2 లక్షలు | 32.90 కోట్లు | 28.35 శాతం |
వొడాఫోన్ఐడియా | -34.67 లక్షలు | 32.55 కోట్లు | 28.05 శాతం |
బీఎస్ఎన్ఎల్ | +4.39 లక్షలు | 11.97 కోట్లు | 10.32 శాతం |