తమ కంపెనీలో గూగుల్ పెట్టుబడులు పెడుతోందంటూ వచ్చిన వార్తలపై వొడాఫోన్ ఐడియా స్పష్టతనిచ్చింది. ప్రస్తుతానికి బోర్డు ముందు అలాంటి ప్రతిపాదనలేవీ లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు బీఎస్‌ఈకి శుక్రవారం సమాచారం ఇచ్చింది. అల్ఫాబెట్‌కు చెందిన గూగుల్ సంస్థ ఐదు శాతం వాటాను వొడాఫోన్ ఐడియాలో కొనుగోలు చేయనుందని వార్తలు వెలువడ్డాయి.
గూగుల్ పెట్టుబడులపై వొడాఫోన్ ఐడియా క్లారిటీ
తమ సంస్థలో వాటా కొనుగోలుకు గూగుల్ ఆసక్తి చూపుతున్నట్లు వస్తున్న వార్తలపై వొడాఫోన్ ఐడియా స్పందించింది. ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదనేది తమ బోర్డు ముందు లేదని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా స్పందించింది. కార్పొరేట్ వ్యూహంలో భాగంగా వాటాదారులను పెంచుకునే అవకాశాలను తాము ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని ఆ కంపెనీ పేర్కొంది. అయితే, ప్రస్తుతానికి తమ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల ముందు అలాంటి ప్రతిపాదనేదీ లేదని చెప్పింది. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే కంపెనీ నిబంధనలకు లోబడి విషయాన్ని బహిర్గతం చేస్తామని తెలిపింది. అలాగే సెబీ లిస్టింగ్స్ రెగ్యులేషన్స్‌కు కంపెనీ కట్టుబడి ఉంటుందని, స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుందని పేర్కొంది.
ఇదీ చూడండి:ఇకపై మొబైల్‌కు 11 అంకెలు..!