తెలంగాణ

telangana

ETV Bharat / business

ఛార్జీలు పెంచిన వొడాఫోన్ ఐడియా.. కొత్త ప్యాక్​లు ఇవే - వ్యాపార వార్తలు

మొబైల్​ కాల్స్, డేటా ఛార్జీలను పెంచుతున్నట్టు వొడాఫోన్ ​ఐడియా ఇటీవలే ప్రకటించింది. తాజాగా పెంచిన ఛార్జీలు.. ఈ నెల 3 నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపింది. వొడాఫోన్ ఐడియా అమలు చేయనున్న కొత్త ప్యాక్​ల పూర్తి వివరాలు మీ కోసం.

VODA IDEA
వొడాఫోన్ ఐడియా

By

Published : Dec 1, 2019, 5:13 PM IST

Updated : Dec 1, 2019, 6:54 PM IST

దేశీయ టెలికాం దిగ్గజం వొడాఫోన్ ఐడియా.. మొబైల్​ కాల్స్​​, డేటా ఛార్జీలు పెంచింది. 2, 28, 84, 365 రోజుల గడువుతో ఈ కొత్త ప్రీపెయిడ్​ ఛార్జీల ప్లాన్లను ప్రకటించింది. ఈ ప్లాన్​ల ఛార్జీలు ఇంతకు ముందుతో పోలిస్తే.. 42 శాతం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ పెంచిన ఛార్జీలు డిసెంబర్​ 3.. అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

కొత్త టారీఫ్​లు ఇలా..

వొడాఫోన్ ఐడియాలో ఉన్న అన్ని ఆల్​రౌండర్​ ప్లాన్లను తొలగించి.. వాటి స్థానంలో రూ.49, రూ.79లతో కాంబో వోచర్ రీఛార్జ్​ను తీసుకొచ్చింది.

ఇందులో రూ.49తో రీఛార్జ్​ చేసుకుంటే.. రూ.38 టాక్​ టైమ్​, 100 ఎంబీ డేటా, కాల్స్​లో ప్రతి సెకనుకు 2.5 పైసల చొప్పున ఛార్జ్​ చేయనున్నారు.

రూ.79 కాంబో వోచర్​తో రూ.64 టాక్​టైం, 200 ఎంబీ డేటా లభిస్తుంది. కాల్స్​పై ప్రతి సెకనుకు 1 పైసా చొప్పున వసూలు చేయనున్నారు. ఈ రెండు ప్యాక్​లకు 28 రోజుల వ్యాలిడిటీ ఉండనుంది.

అన్​లిమిటెడ్​ ప్యాక్​లు

కొత్త టారీఫ్​లలో 28, 84, 365 రోజుల వ్యాలిడిటీతో.. అన్​లిమిటెడ్​ ప్యాక్​లను తీసుకువచ్చింది వొడాఫోన్ ఐడియా.

28 రోజుల వ్యాలిడిటీ ప్యాక్​ల వివరాలు..

  • రూ.149-అపరిమిత వాయిస్​ కాల్స్ (1000 నిమిషాల ఆఫ్​-నెట్​ కాల్స్​), 2జీబీ డేటా, 300 ఎస్​ఎంఎస్​లు
  • రూ.249-అపరిమిత వాయిస్​ కాల్స్ (1000 నిమిషాల ఆఫ్​-నెట్​ కాల్స్​), రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్​ఎంఎస్​లు
  • రూ.299-అపరిమిత వాయిస్​ కాల్స్​ (1000 నిమిషాల ఆఫ్​-నెట్​ కాల్స్​), రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్​ఎంఎస్​లు
  • రూ.399-అపరిమిత వాయిస్​ కాల్స్​ (1000 నిమిషాల ఆఫ్​-నెట్​ కాల్స్​), రోజుకు 3 జీబీ డేటా, 100 ఎస్​ఎంఎస్​లు

84 రోజుల వ్యాలిడిటీ ప్యాక్​లు ఇవే..

  • రూ.379-అపరిమిత వాయిస్​ కాల్స్ (3000 నిమిషాల ఆఫ్​-నెట్ కాల్స్), 6 జీబీ డేటా, 1000 ఎస్​ఎంఎస్​లు
  • రూ.599-అపరిమిత వాయిస్​ కాల్స్ (3000 నిమిషాల ఆఫ్​-నెట్ కాల్స్), రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్​ఎంఎస్​లు
  • రూ.699-అపరిమిత వాయిస్​ కాల్స్ (3000 నిమిషాల ఆఫ్​-నెట్ కాల్స్), రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్​ఎంఎస్​లు

వార్షిక ప్లాన్​లు (365 రోజుల వ్యాలిడిటీ)

  • రూ.1499-అపరిమిత వాయిస్​ కాల్స్ (12000 నిమిషాల ఆఫ్​-నెట్ కాల్స్), 24 జీబీ డేటా, 3600 ఎస్​ఎంఎస్​లు
  • రూ.2399-అపరిమిత వాయిస్​ కాల్స్ (12000 నిమిషాల ఆఫ్​-నెట్ కాల్స్), రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్​ఎంఎస్​లు

వీటితో పాటు అన్​లిమిటెడ్ ప్లాన్​లో రెండు రోజుల వ్యాలిడిటీతో చిన్న ప్యాక్​ను వొడాఫోన్ ఐడియా అందిస్తోంది. దీని ధర రూ.19గా నిర్ణయించింది. అన్​లిమిటెడ్ ఆన్​-నెట్ వాయిస్​ కాల్స్​, 150 ఎంబీ డేటా, 100 ఎస్​ఎంఎస్​లు ఈ ప్యాక్​లో లభించనున్నాయి.

ఫస్ట్​ రీఛార్జ్​ ఆఫర్స్(ఎఫ్​ఆర్​సీ)​ ఇలా..

కొత్తగా వొడాఫోన్ ఐడియా​ నెట్​వర్క్​ను ఎంచుకున్న వారి కోసం ఒక టాప్ వోచర్​తో పాటు మూడు అన్​లిమిటెడ్​ ప్లాన్లను తీసుకురానుంది. వాటిలో రూ.97 ఎఫ్​ఆర్​సీ రీఛార్జా చేసుకుంటే రూ.45 టాక్​టైం, 100 ఎంబీ డేటా లభించనుంది. వాయిస్​ కాల్స్​కు ప్రతి సెకనుకు 1పైసా చొప్పన ఛార్జ్​ చేయనుంది.

ఎఫ్​ఆర్​సీ ఆన్​లిమిటెడ్​ ప్లాన్​లు​..

  • రూ.197-అపరిమిత వాయిస్​ కాల్స్ (1000 నిమిషాల ఆఫ్​-నెట్ కాల్స్), 2 జీబీ డేటా, 300 ఎస్​ఎంఎస్​లు, 28 రోజుల వ్యాలిడిటీ.
  • రూ.297-అపరిమిత వాయిస్​ కాల్స్ (1000 నిమిషాల ఆఫ్​-నెట్ కాల్స్), రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్​ఎంఎస్​లు, 28 రోజుల వ్యాలిడిటీ.
  • రూ.647-అపరిమిత వాయిస్​ కాల్స్ (3000 నిమిషాల ఆఫ్​-నెట్ కాల్స్), రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్​ఎంఎస్​లు, 84 రోజుల వ్యాలిడిటీ.

ఇదీ చూడండి:జీఎస్టీ వసూళ్ల వృద్ధి.. నవంబర్​లో మళ్లీ లక్ష కోట్ల ప్లస్

Last Updated : Dec 1, 2019, 6:54 PM IST

ABOUT THE AUTHOR

...view details