తెలంగాణ

telangana

ETV Bharat / business

వొడాఫోన్-​ఐడియా క్యూ2 నష్టం రూ.50,921 కోట్లు..

టెలికాం సంస్థ వొడాఫోన్-​ఐడియా 2019-20 రెండో త్రైమాసికంలో భారీ నష్టాన్ని నమోదు చేసింది. ఏజీఆర్​ బకాయిలు ప్రభుత్వానికి చెల్లించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో.. మొత్తం నష్టం రూ.50,921 కోట్లుగా ప్రకటించింది ఆ సంస్థ.

వొడాఫోన్​ఐడియా

By

Published : Nov 14, 2019, 11:47 PM IST

ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్‌-ఐడియా భారీ నష్టాలను చవిచూసింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆ సంస్థ రూ.50,921 కోట్ల నష్టాలను ప్రకటించింది. గతేడాది ఇదే కాలానికి వొడాఫోన్‌ రూ.4,874 కోట్లు నష్టాన్ని నమోదు చేయడం గమనార్హం.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సమీక్షిస్తున్న త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 42 శాతం మేర పెరిగి రూ.11,146 కోట్లుగా ప్రకటించింది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) విషయంలో సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.44,150 కోట్లను కలిపి ఈ నష్టాలను వొడాఫోన్‌ ప్రకటించింది.

టెలికాం చరిత్రలో ఓ కంపెనీ ఈ స్థాయిలో నష్టాలు ప్రకటించడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు ఈ సందర్భంగా కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. న్యాయపరంగా, ప్రభుత్వం నుంచి బకాయిల విషయంలో ఊరట లభిస్తేనే వొడాఫోన్‌ మనగలుగుతుందని కంపెనీ పేర్కొంది.

మరోవైపు ఎయిర్‌టెల్‌ ఇదే త్రైమాసికానికి రూ.23,045 కోట్ల నష్టాలను ప్రకటించింది.

ఇదీ చూడండి:భారత జీడీపీ వృద్ధి రేటు మరోసారి తగ్గించిన మూడీస్​

ABOUT THE AUTHOR

...view details