ప్రముఖ సంస్థ వొడాఫోన్-ఐడియా ఏజీఆర్ బకాయిల కింద శనివారం మరో రూ.1,000 కోట్లు టెలికాం విభాగానికి చెల్లించింది. తాజా చెల్లింపులతో కలిపి ఇప్పటివరకు టెలికాం విభాగానికి వొడాఫోన్-ఐడియా మొత్తం రూ. 7,854 కోట్లు చెల్లించింది.
'మరో రూ.వెయ్యి కోట్ల ఏజీఆర్ బకాయి చెల్లించాం' - వొడాఐడియా ఏజీఆర్ బకాయిలు
ఏజీఆర్ బకాయి కింద మరో రూ.వెయ్యి కోట్లు టెలికాం విభాగానికి చెల్లించింది వొడాఫోన్ ఐడియా. త్వరలో సుప్రీం కోర్టులో ఏజీఆర్ వివాదంపై విచారణ జరగనున్న నేపథ్యంలో.. గత ఆదేశాలకు అనుగుణంగా ఈ చెల్లింపు జరిపింది టెలికాం సంస్థ.
వొడాఫోన్ ఐడియా ఏజీఆర్ బకాయిలు
జులై మూడో వారంలో విచారణ సమయానికి వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌లు తమ ఆర్థిక స్థితిపై స్టేట్మెంట్ను సమర్పించాలని సుప్రీం కోర్టు గత నెలలో సూచించింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రభుత్వానికి డబ్బు అవసరమని.. ఇందుకోసం ఆయా టెలికాం సంస్థలు కొంత ఏజీఆర్ బకాయి కూడా చెల్లించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే వొడాఫోన్ ఐడియా రూ.వెయ్యి కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి:యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌కు గడువు పెంపు