దేశీయ టెలికాం దిగ్గజం వొడాఫోన్-ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలోనూ తేరుకోలేకపోయింది. 2019-20 డిసెంబర్ త్రైమాసికంలో ఈ సంస్థ రూ.6,438.8 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ నష్టం రూ.5,004.6 కోట్లుగా ఉంది.
ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సిందేనని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో.. సంస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ కారణంగా త్రైమాసిక ఫలితాల్లో వరుసగా భారీ నష్టాలను ప్రకటిస్తూ వస్తోంది.