తెలంగాణ

telangana

ETV Bharat / business

విమానాల్లో క్రికెట్ ప్రత్యక్ష ప్రసారం.. ఎప్పట్నుంచో తెలుసా? - వాణిజ్య వార్తలు

విమానాల్లో వైఫై సేవలను ప్రవేశపెట్టనుంది ప్రముఖ ఎయిర్​లైన్స్ సంస్థ 'విస్తారా'. విమానాల్లో వాయిస్​, డేటా సేవలకు పౌర విమానయాన శాఖ ఆమోదం తెలిపిన నేపథ్యంలో విస్తారా ఆ దిశగా అడుగులు వేసింది. కొత్తగా కొనుగోలు చేసిన బోయింగ్​ 787 విమానాల్లో వైఫై సౌకర్యం కల్పించనుంది. తద్వారా ఫేస్​బుక్​, వాట్సప్​ సేవలతో పాటు, క్రికెట్​ ప్రత్యక్ష ప్రసారాలను కూడా చూడవచ్చని సంస్థ తెలిపింది.

vistara
విస్తారా

By

Published : Feb 19, 2020, 7:18 PM IST

Updated : Mar 1, 2020, 9:08 PM IST

సింగపూర్​ ఆధారిత భారత ఎయిర్​లైన్స్​ 'విస్తారా' తన విమానాల్లో వైఫై సేవలను అందించేందుకు సిద్ధమైంది. ఫలితంగా దేశంలోనే వైఫై సేవలు అందించే మొదటి విమానయాన సంస్థగా గుర్తింపు పొందనుంది విస్తారా .

తాము అందించబోయే వైఫై సౌకర్యంతో ఫేస్​బుక్​, వాట్సప్​తో పాటు క్రికెట్​ ప్రత్యక్ష ప్రసారాలను కూడా వీక్షించవచ్చని తెలిపారు విస్తారా చీఫ్ స్ట్రేటజీ అధికారి వినోద్​ కణ్నన్​. అయితే ఈ సేవలకు సంబంధించి ఛార్జీలను మరికొన్ని వారాల్లో నిర్ణయిస్తామని స్పష్టం చేశారు.

సంస్థకు చెందిన ఎయిర్​బస్​ 321 విమానాలతో పాటు కొత్తగా కొనుగోలు చేయబోయే బోయింగ్ 787 డ్రీమ్​లైనర్లలో ఈ సౌకర్యం కల్పించనుంది విస్తారా సంస్థ. కొనుగోలు చేసిన 6 డ్రీమ్ ​లైనర్లు ఈ నెల చివరి వరకు విస్తారాకు అందనున్నాయి. మార్చిలో వైఫై సేవలను ప్రారంభించే అవకాశం ఉంది.

పోటీని ఎదుర్కొనేందుకే..

భారత్​లో ఖరీదైన విమానయాన సంస్థగా పేరొందిన విస్తారా.. బడ్జెట్​ ఎయిర్​లైన్స్​ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. వైఫై సేవల ద్వారా పుంజుకోవచ్చని సంస్థ భావిస్తోంది.

విమానాల్లో వైఫై సౌకర్యం కల్పించాలని భారత్​ 2016లో నిర్ణయించింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆమోద ప్రక్రియ ఆలస్యమైంది. సమాచార శాఖతో దీర్ఘకాలిక చర్చల అనంతరం వాయిస్​, డేటా, వీడియో సేవలను కల్పిస్తూ భారత టెలిగ్రాఫ్​ చట్ట నిబంధనలను సవరించింది పౌర విమానయాన శాఖ.

Last Updated : Mar 1, 2020, 9:08 PM IST

ABOUT THE AUTHOR

...view details