టాటా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ విస్తార ఉద్యోగుల వేతనాలపై కీలక నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్లో ఆదాయం తగ్గిన కారణంగా ఈ ఏడాది చివరి వరకు వేతనాల్లో 5-20 శాతం కోత విధించనున్నట్లు వెల్లడించింది. దాదాపు 40 శాతం ఉద్యోగులపై వేతనాల కోత ప్రభావం పడనున్నట్లు తెలిపింది. మిగత 60 శాతం ఉద్యోగుల వేతనాలపై ప్రభావం ఉండదని పేర్కొంది.
విస్తారలో ప్రస్తుతం 4,000 మంది ఉద్యోగులున్నారు.
సీఈఓ వేతనం 20 శాతం కోత..
'జులై 1 నుంచి డిసెంబర్ 31 వరకు నెలవారీ వేతనాల్లో కోత అమలు చేయనున్నాం. వ్యక్తిగతంగా నేను 20 శాతం వేతనం తగ్గించుకోనున్నాను. పైలట్లు మినహా మిగత సిబ్బందిపై వేతనాల కోత ప్రభావం పడనుంది' అని ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్లో విస్తార సీఈఓ లెస్లీ థంగ్ పేర్కొన్నారు. పైలట్లకు ఫ్లయింగ్ అలవెన్సుల్లో తగ్గింపు ఉంటుందని అందులో తెలిపారు.