కరోనాతో భారీగా నష్టపోయిన వాటిల్లో విమానయాన రంగం కూడా ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా చాలా విమాన సంస్థలు ఖర్చులు తగ్గించుకునే పనిలోపడ్డాయి. ఇందులో భాగంగా ఉద్యోగులను తొలగించుకోవడం వంటి చర్యలు చేపట్టాయి. ఇప్పుడు ఈ జాబితాలో ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్ ఫ్రాన్స్ దాని ప్రాంతీయ అనుబంధ సంస్థ హాప్‌లు చేరాయి.
ఉద్యోగాల కోత ఇలా..
కరోనాతో ఎదురైన సంక్షోభం కారణంగా ఈ రెండు సంస్థలు 7,500 మంది ఉద్యోగులను (ఎయిర్ ఫ్రాన్స్ 6,500 మంది, హాప్ 1,000 మంది) తొలగించనున్నట్లు ప్రకటించాయి. ప్రస్తుతం ఎయిర్‌ఫ్రాన్స్‌లో 41,000 మంది, హాప్లో 2,400 మంది ఉద్యోగులు ఉన్నారు.