దేశీయ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా(వి) తమ యూజర్లను అప్రమత్తం చేసింది. కంపెనీ పేరును అక్రమంగా వాడుకుని మోసాలు జరుగుతున్నాయని.. వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
మోసాలు ఎలా జరుగుతున్నాయంటే..
మీ కేవైసీ అప్డేట్ చేయాలి అంటూ.. 'వి' యూజర్లకు మెసేజ్లు, కాల్స్ వస్తున్నాయి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయకుంటే సేవలు నిలిచిపోతాయని అందులో పేర్కొంటున్నారు సైబర్ నేరగాళ్లు.
అలాంటి లింక్లు నిజమేనని నమ్మి వాటిని క్లిక్ చేస్తే.. వ్యక్తిగత డేటా, ఫోన్లో ఉన్న విలువైన సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని తెలిపింది 'వి'. ఇది ఆర్థిక నష్టాలకు దారితీయొచ్చని పేర్కొంది.
ఈ నేపథ్యంలో కేవైసీ అప్డేట్ చేసుకోమని, వ్యక్తిగత సమాచారం కోరుతూ కంపెనీ ఎలాంటి కాల్స్, మెసేజ్లు పంపదని స్పష్టం చేసింది వొడాఫోన్ ఐడియా. అలా ఏవైనా సందేశాలు, కాల్స్ వచ్చినా వాటికి స్పందించొద్దని సూచించింది.
ఇదీ చదవండి:పాత నోట్లు, నాణేలు పేరుతో మోసాలు- ఆర్బీఐ వార్నింగ్