తెలంగాణ

telangana

ETV Bharat / business

ట్రైబ్యునల్ తీర్పుపై మిస్త్రీ- టాటా స్పందన - Will take appropriate against NCLAT order: Tata Sons

టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​గా తనను పునర్నియమించాలన్న జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్​సీఎల్​ఏటీ) తీర్పును స్వాగతించారు సైరస్ మిస్త్రీ. తీర్పు మైనారిటీ వాటాదారుల హక్కులను కాపాడిందన్నారు. అదే సమయంలో తీర్పుపై న్యాయవిధానాలతో ముందుకెళ్తామని పేర్కొంది టాటా సన్స్. వాటాదారుల నిర్ణయానికి వ్యతిరేకంగా ట్రిబ్యునల్ తీర్పు ఎలా ఇచ్చిందో స్పష్టత లేదని వ్యాఖ్యానించింది.

mistry
మిస్త్రీ

By

Published : Dec 18, 2019, 9:06 PM IST

Updated : Dec 18, 2019, 11:02 PM IST

టాటా సన్స్​ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​గా తనను పునర్నియమించాలన్న జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్​సీఎల్​ఏటీ) అపీలేట్ ట్రిబ్యునల్ తీర్పుపై స్పందించారు సైరస్ మిస్త్రీ. ఇది తనొక్కడి విజయమే కాదని.. సుపరిపాలన విధానాలు, మైనారిటీ వాటాదారుల హక్కులకు దక్కిన విజయమని పేర్కొన్నారు.

గత చేదు అనుభవాలను మరచిపోవాలని, కలిసికట్టుగా పనిచేయాలని కోరారు మిస్త్రీ.

"టాటా గ్రూప్ సుస్థిరాభివృద్ధికి అంతా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంది. సంస్థను ముందంజలో నిలపాలి. టాటా గ్రూప్ అభివృద్ధి, సంస్థలోని కంపెనీలు, వాటాదారుల నిర్వహణ, సరళమైన పాలనా విధానాలు, ఉద్యోగులు, పెట్టుబడిదారులు వంటి అంశాలే టాటా సంస్థలకు ఆస్తి."
-సైరస్ మిస్త్రీ.

తొలుత టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బాధ్యతల నుంచి అనంతరం బోర్డు సభ్యుడి పదవి నుంచి తొలగించారని.. కానీ తాను అనుసరించిన విధానాలు సరైనవేనని అపీలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు రుజువు చేస్తోందన్నారు మిస్త్రీ.

టాటా స్పందన

ఎన్​సీఎల్​ఏటీ అపీలేట్ తీర్పుపై స్పందించింది టాటా సన్స్. చట్టపరమైన విధానాలతో ముందుకెళ్తామని స్పష్టం చేసింది. వాటాదారుల నిర్ణయానికి వ్యతిరేకంగా అపీలేట్ ట్రైబ్యునల్ తీర్పు ఎలా ఇచ్చిందో అర్థం కావడం లేదని వెల్లడించింది.

"టాటా సన్స్ వాటాదారుల సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్​సీఎల్​ఏటీ ఎలా నిర్ణయం తీసుకుందో స్పష్టత లేదు."
-టాటా సన్స్.

ఇదీ చూడండి: టాటా గ్రూపునకు షాక్​- ఛైర్మన్​గా సైరస్ మిస్త్రీ పునర్​ నియామకం

Last Updated : Dec 18, 2019, 11:02 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details