దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టెలికాం సంస్థలు తమ వినియోగదారులకు కొవిడ్ రిలీఫ్ ఆఫర్లు ఇస్తున్నాయి. తక్కువ ఆదాయం కలిగిన 6కోట్ల వినియోగదారులకు రూ.49 విలువైన రీఛార్జ్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు వొడాఫోన్ ఐడియా (వి) మంగళవారం ప్రకటించింది. ఇందుకోసం రూ.294 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించింది.
రూ.49 ఉచిత రీఛార్జ్ ద్వారా 28 రోజుల వ్యాలిడిటీతో రూ.38 టాక్‌టైం, 100 డేటా లభించనుంది. ఫ్రీ రీఛార్జ్‌తో పాటు ఆర్సీ 79 ద్వారా రూ.128 టాక్‌టైం, 200 ఏంబీ డేటాను 28 రోజుల వ్యాలిడిటీతో ఇస్తున్నట్లు తెలిపింది.
ఇతర టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కూడా ఇది వరకే తమ యూజర్లకు కొవిడ్ రిలీఫ్ ఆఫర్లు ప్రకటించాయి.
జియో ఫ్రీ టాక్‌టైం..