మైనింగ్ దిగ్గజం వేదాంత.. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)లో ప్రభుత్వ వాటను కొనుగోలుకు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్ దాఖలకు చేసినట్లు ఆధికారికంగా ప్రకటించింది.
ఇప్పటికే ఉన్న చమురు, గ్యాస్ వ్యాపారాలను మరింత విస్తరించేందుకు.. దేశంలోనే రెండో అతిపెద్ద చమురు సంస్థ అయిన బీపీసీఎల్ కొనుగోలు ఉపయోగపడుతుందని భావిస్తోంది వేదాంత.
బీపీసీఎల్‌లో 52.98 శాతం ప్రభుత్వ వాటా కొనుగోలుకు ప్రాథమిక ఆసక్తి వ్యక్తీకరణ తెలిపేందుకు తుది గడువు ఈ నెల 16తో ముగిసింది.
బీపీసీఎల్ కొనుగోలుకు ఆసక్తి వ్యక్తీకరణ చేస్తూ చాలా బిడ్లు వచ్చాయని ప్రభుత్వం వెల్లడించింది. ఏ ఏ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
ఇదీ చూడండి:'జీవనకాల గరిష్ఠానికి ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పే నెలవారీ యూజర్లు'