వేదాంత లిమిటెడ్‌కు(Vedanta Ltd) చెందిన హోల్డింగ్ కంపెనీలు తమ షేర్లను తాకట్టు పెట్టి 800 మిలియన్ డాలర్లు( రూ.6వేల కోట్లు) సమీకరించాయి. వేదాంత లిమిటెడ్‌లోని సుమారు 65.128 శాతం వాటాను తాకట్టు పెట్టడం వల్ల.. మూడు ఒప్పందాల్లో ఈ నిధులను సమీకరించినట్లు సెబీ ఫైలింగ్‌లో వేదాంత పేర్కొంది.
- మొదటి ఒప్పందం ప్రకారం.. ట్విన్ స్టార్ హోల్డింగ్స్ లిమిటెడ్(Twin Star Holdings Ltd ), లండన్‌కు చెందిన స్టాండర్డ్ చార్టెర్డ్ బ్యాంక్‌తో 400 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది.
- రెండోది.. వేదాంత నెదర్లాండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ బీవీ(Vedanta Netherlands Investments BV).. 150 మిలియన్ డాలర్లను స్టాండర్డ్ చార్టెర్డ్ బ్యాంక్, లండన్ ద్వారా పొందింది.
- మూడోది.. వేదాంత రీసోర్సెస్(Vedanta Resources Limited) 250 మిలియన్ డాలర్లను హాంగ్‌కాంగ్‌కు చెందిన స్టాండర్డ్ చార్టెర్డ్ బ్యాంక్ నుంచి సేకరించింది. ఈ ఒప్పందాల్లో రుణ గ్రహీతలు, హామీదారులు ప్రమోటర్లుగా వేదాంత ఫైలింగ్ పేర్కొంది.
మరోవైపు.. వేదాంత నెదర్లాండ్స్ ఇన్వెస్ట్మెంట్ బీవీ, ట్విన్‌స్టార్ హోల్డింగ్స్.. వరుసగా 1.71, 2.80 శాతం మేర వేదాంతలో ఈక్విటీ షేర్ క్యాపిటల్‌ను కలిగి ఉన్నట్లు మడిసన్ పసిఫిక్ ట్రస్ట్ వెల్లడించింది. కొద్ది రోజుల క్రితం వేదాంత లిమిటెడ్‌లోని 17 కోట్ల ఈక్విటీ షేర్లను ఒక్కోషేరుకు రూ.350 చొప్పున రూ. 5,950 కోట్లకు కొనుగోలు చేయాలని భావించాయి.