యాపిల్ సీఈఓ టిమ్‌కుక్, ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృసంస్థ)సీఈఓ సుందర్ పిచాయ్, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్‌లు ఈ నెల 27న 'ది యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ జ్యుడీషియరి' ముందు హాజరుకానున్నారు. యాంటిట్రస్ట్ ప్యానెల్ దర్యాప్తులో భాగంగా వీరిని ప్రశ్నించనున్నారు అధికారులు.
డిజిటల్ మార్కెట్‌కు సంబంధించి సంస్కరణలు, నియంత్రణ పరమైన ప్రతిపాదనలపై పని చేస్తోంది యాంటిట్రస్ట్ ప్యానెల్. ఈ దర్యాప్తులో సీఈఓలు తమ అభిప్రాయాలనూ వెల్లడించనున్నారు.
ఈ నెల 27న యాంటిట్రస్ట్ ప్యానెల్ ముందుకు వీరంత ఒకేసారి హాజరు కానున్నారు. నాలుగు దిగ్గజ సంస్థల అధినేతలు ఒకేసారి హాజరు కావడం ఇదే ప్రథమం. కరోనా నేపథ్యంలో వీరు నేరుగా హాజరవుతారా, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడతారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.