ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోను 'క్లీన్ టెల్కో'ల జాబితాలో చేర్చింది అమెరికా. చైనాకు చెందిన హువావే వంటి టెలికాం సంస్థలతో వ్యాపారం చేసేందుకు జియో నిరాకరించడమే ఇందుకు ప్రధాన కారణం.
తమ కమ్యూనికేషన్, క్లౌడ్, మొబైల్ యాప్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డేటా విశ్వసనీయత లేని సంస్థల చేతిలో పడకుండా చూసుకోవడం, అలాంటి కంపెనీలతో సంబంధాలు పెట్టుకోని సంస్థలనే 'క్లీన్ టెల్కో'లుగా నిర్వచించింది అమెరికా.
క్లీన్ టెల్కోల జాబితాలో భారత్కు చెందిన రిలయన్స్ జియోతో పాటు ఆరెంజ్ (ఫ్రాన్స్), టెలెస్ట్రా (ఆస్ట్రేలియా), ఎస్కే, ఎస్టీ (దక్షిణ కొరియా), ఎన్టీటీ (జపాన్), ఓ2 (బ్రిటన్) వంటి సంస్థలు ఉన్నాయి. ఈ టెల్కోలన్నీ హువావే వంటి సంస్థతో వ్యాపారం చేసేందుకు నిరాకరించాయి.