తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత్​లో 'విద్య' కోసం అమెరికా భారీ రుణసాయం

భారత్​లో విద్యారంగం కోసం కృషి చేస్తోన్న వర్థన అనే అంకుర సంస్థకు అమెరికా డెవలప్​మెంట్​ ఫైనాన్షియల్ కార్పొరేషన్​ 1.5 కోట్ల డాలర్ల రుణాన్ని అందించనుంది. దేశంలో నాణ్యమైన విద్య అందించేందుకు ఈ సంస్థకు సాయం అందిస్తున్నట్లు తెలిపింది.

us help
అమెరికా బ్యాంకు రుణసాయం

By

Published : May 5, 2020, 3:10 PM IST

భారత్​కు చెందిన ఒక అంకుర సంస్థకు అమెరికా డెవలప్​మెంట్​ ఫైనాన్స్ కార్పొరేషన్(డీఎఫ్​సీ) భారీ రుణసాయం అందించనుంది. విద్యారంగం అభివృద్ధికి కృషి చేస్తోన్న బెంగళూరుకు చెందిన వర్థన అనే సంస్థకు 1.5 కోట్ల డాలర్ల రుణాన్ని ఇచ్చేందుకు అంగీకరించింది డీఎఫ్​సీ.

ఈ సాయంతో వర్థన మరిన్ని పాఠశాలలకు విస్తరించేందుకు దోహదపడుతుందని డీఎఫ్​సీ అభిప్రాయపడింది.

"సమయానికి రుణాలు అందితే పాఠశాలలకు వర్థన సహకారం అందించే అవకాశం పెరుగుతుంది. డిజిటల్ లెర్నింగ్ పరికరాలు, బోధన పద్ధతులను మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది. కరోనా సంక్షోభంలోనూ ఆన్​లైన్​ ద్వారా విద్యార్థులు చదువుకోగలరు. మహమ్మారితో కలిగిన నష్టాన్ని తీర్చే అవకాశం ఉంటుంది."

- అమెరికా డెవలప్​మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్

వర్థన సంస్థను బ్రజేశ్ మిశ్రా, స్టీవ్​ హార్డ్​గ్రేవ్​ కలిసి 2013లో స్థాపించారు. ఇప్పటివరకు దేశంలోని 3,500 పాఠశాలలకు వర్థన సాయం అందించింది. వీటిలో 84 వేల మంది ఉపాధ్యాయులు, 25 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు.

ఈ సంస్థ ఒక ప్రత్యేకమైన నగదు ప్రవాహ పూచీకత్తు విధానాన్ని ఉపయోగిస్తోంది. తక్కువ ఫీజు వసూలు చేసే పాఠశాలలకు సరళ విధానంలో స్థిర రుణాలను అందిస్తోంది. వర్థన కింద ఉన్న పాఠశాలలు చాలా తక్కువ ఫీజు వసూలు చేస్తున్నాయి. ఫలితంగా దిగువ, మధ్య తరగతి కుటుంబాలను తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన విద్య అందుతోంది.

ABOUT THE AUTHOR

...view details