తెలంగాణ

telangana

ETV Bharat / business

అమెరికా కార్పొరేట్లను మెప్పించిన భారత్​ బడ్జెట్ - అమెరికా కంపెనీలు

కేంద్ర బడ్జెట్​ను అమెరికా కార్పొరేట్ వర్గాలు ప్రశంసించాయి. భారత మార్కెట్ తలుపులు తెరిచి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ఉందని వ్యాఖ్యానించాయి. అమెరికా సంస్థలకూ ఇది ప్రయోజనకరమని అభిప్రాయం వ్యక్తం చేశాయి.

అమెరికా కార్పొరేట్లను మెప్పించిన భారత్​ బడ్జెట్

By

Published : Jul 6, 2019, 11:17 AM IST

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మొదటిసారి​ ప్రవేశపెట్టిన బడ్జెట్​ను అమెరికా కార్పొరేట్​ వర్గాలు స్వాగతించాయి. ఈ బడ్జెట్ విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఉందని ప్రశంసించాయి.

పెట్టుబడులకు ప్రోత్సాహం..

మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్​ సానుకూల, నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టడానికి ఉపకరిస్తుందని యూఎస్​ ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్టనర్​షిప్​ ఫోరమ్​ అధ్యక్షుడు ముఖేశ్ అఘి పేర్కొన్నారు. భారత్​ మార్కెట్​ తలుపులు తెరిచి, అమెరికా సంస్థలు అక్కడ ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహిస్తుందని అన్నారు. అదే సమయంలో దిగువ వర్గాల సంపదను పెంపొందిస్తుందని విశ్లేషించారు ముఖేశ్​.

"మోదీ 2.0 ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సమగ్రంగా ఉంది. అందులోని విధాన నిర్ణయాలు అమెరికా కంపెనీలకు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. యాపిల్​ లాంటి కంపెనీలకు ఇది మంచివార్త."
-ముఖేశ్ అఘి,​ యూఎస్​ ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్టనర్​షిప్​ ఫోరమ్​ అధ్యక్షుడు

సంస్కరణలు భేష్​...

"మోదీ ప్రభుత్వ 2019-20 బడ్జెట్ సంస్కరణ దృక్పథంతో ఉండడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది."
-నిషా దేశాయ్ బిశ్వాల్​, యూఎస్​ ఇండియా బిజినెస్ కౌన్సిల్​ అధ్యక్షురాలు

రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి, అనేక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రోత్సహించడానికి తీసుకున్న క్రియాశీలక చర్యలు అభినందనీయమని బిశ్వాల్​ పేర్కొన్నారు. బీమా మధ్యవర్తుల కోసం 100 శాతం ఎఫ్​డీఐలను అనుమతించడానికి, ఎఫ్​పీఐ పెట్టుబడి పరిమితులను పెంచడానికి తీసుకున్న చర్యలనూ స్వాగతించారు. ఈ సంస్కరణలకు యూఎస్​ఐబీసీ మద్దతు ఉంటుందని బిశ్వాల్​ అన్నారు.

ఉద్యోగాల సృష్టి

"2022 కల్లా అందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామన్న బడ్జెట్​ ప్రతిపాదన వల్ల దిగువ తరగతి వారికి గృహ వసతి కలుగుతుంది. సిమెంట్, స్టీల్ పరిశ్రమల్లో ఉద్యోగాల సృష్టి జరుగుతుంది" అని ఇండియన్ ఛాంబర్​ ఆఫ్​ కామర్స్ అధ్యక్షుడు కరుణ్​ రుషి అభిప్రాయపడ్డారు.

"నేను మరిన్ని గొప్ప సంస్కరణలను ఊహించాను. బదులుగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక కార్యక్రమాల విస్తరణ, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాల కొనసాగింపును చూస్తున్నాను."
-రిక్ రోసో, సెంటర్ ఫర్​ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details