తెలంగాణ

telangana

ETV Bharat / business

వాణిజ్య యుద్ధం 2.0: బ్లాక్​లిస్ట్​లో హువావే - ఎన్టీటీ లిస్ట్​

చైనా టెలికమ్యూనికేషన్​​ ఉపకరణాల దిగ్గజం హువావేను బ్లాక్​లిస్ట్​లో చేర్చింది అమెరికా. అగ్రరాజ్య సంస్థలు విదేశీ టెలికాం ఉపకరణాలు వినియోగించకూడదని తేల్చిచెప్పింది. ఆ సంస్థల ఉత్పత్తులతో దేశ భద్రతకు ముప్పు ఉండడమే ఈ నిర్ణయానికి కారణమని తెలిపింది.

హువావే

By

Published : May 16, 2019, 11:28 AM IST

చైనాతో వాణిజ్య వివాదాన్ని మరింత తీవ్రతరం చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా సంస్థలు ఇతర దేశాలకు చెందిన టెలికాం ఉపకరణాలను వినియోగించరాదంటూ అధికారిక ఆదేశాలు జారీ చేశారు​. దేశీయ భద్రతకు ముప్పు ఉన్నందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

ట్రంప్​ జారీ చేసిన ఆదేశాల్లో చైనీస్​ టెలికమ్యూనికేషన్​ దిగ్గజం హువావే పేరు ఎక్కడా లేకపోయినా... ఆ సంస్థే అసలు లక్ష్యంగా కనిపిస్తోంది.

ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన కాసేపటికే... వాణిజ్య శాఖ కీలక ప్రకటన చేసింది. హువావేను "ఎన్టిటీ లిస్ట్​"లో చేర్చుతున్నట్లు వెల్లడించింది. అమెరికా భద్రత, విదేశాంగ విధానాలకు విరుద్ధంగా ఆ సంస్థ వ్యవహరించడమే ఈ చర్యకు కారణమని తెలిపింది వాణిజ్య శాఖ.

ఎన్టిటీ లిస్ట్​ అంటే..?

ఎన్టిటీ లిస్ట్​లో ఉన్న సంస్థలు నేరుగా అమెరికన్​ సాంకేతికతను కొనుగోలు చేసేందుకు వీలు ఉండదు. తప్పనిసరిగా పరిశ్రమ, భద్రత బ్యూరో-బీఐఎస్​ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దేశ భద్రతకు హాని కలుగుతుందని భావిస్తే బీఐఎస్​ లైసెన్స్​ నిరాకరించవచ్చు.

కొత్త కాదు...

చైనా కేంద్రంగా పనిచేసే హువావే... ప్రపంచంలోనే అతిపెద్ద టెలికమ్యూనికేషన్​ పరికరాల తయారీ సంస్థ. ట్రంప్​ సర్కార్​కు, ఈ సంస్థకు ఎప్పటినుంచో వైరం ఉంది.

వావేతోపాటు చైనాకు చెందిన జెడ్​టీఈ కార్ప్​ తయారుచేసిన పరికరాలను అమెరికా ప్రభుత్వ శాఖలు వాడడంపై ట్రంప్ గతేడాది ఆగస్టులోనే నిషేధం విధించారు.
హువావేపై ఇప్పుడు మరిన్ని ఆంక్షలు విధించడాన్ని అమెరికా చట్టసభ్యులు పార్టీలకు అతీతంగా సమర్థించారు.

ABOUT THE AUTHOR

...view details