తెలంగాణ

telangana

ETV Bharat / business

హైదరాబాద్​ కంపెనీలో అమెరికన్ టీకా ఉత్పత్తి!

అమెరికాకు చెందిన బేలర్ వైద్య కళాశాల అభివృద్ధి చేసిన టీకాను ఉత్పత్తి చేసేందుకు హైదరాబాద్​ ఆధారిత 'బయోలాజికల్-ఈ' సంస్థ ఒప్పందం చేసుకుంది. బీఈ లిమిటెడ్​కు అనుభవం దృష్ట్యా ఒప్పందం చేసుకున్నట్లు బేలర్​ ప్రతినిధులు వెల్లడించారు.

VIRUS-US-INDIA-VACCINE
బయోలాజికల్​-ఈ

By

Published : Aug 28, 2020, 4:15 PM IST

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా కంపెనీ 'బయెలాజికల్-ఈ లిమిటెడ్‌'.. కరోనా టీకాను ఉత్పత్తి చేయనుంది. ఈ మేరకు టెక్సాస్‌లోని బేలర్‌ వైద్య కళాశాల(బీసీఎం) అభివృద్ధి చేసిన టీకాను ఉత్పత్తి చేసేందుకు అనుమతి ఒప్పందం కుదుర్చుకుంది

తాము తయారు చేసిన టీకాను మరింత అభివృద్ధి చేసి, ప్రజలకు అందుబాటులోకి తేవటానికి వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో అనుభవం కలిగిన 'బయోలాజికల్-ఈ'తో ఒప్పందం చేసుకున్నట్లు బీసీఎం ప్రతినిధులు తెలిపారు. సార్స్‌, మెర్స్‌ టీకాలను అభివృద్ధి చేసిన అనుభవంతో కొవిడ్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. తాము అభివృద్ధి చేసిన టీకాను వంద కోట్ల డోసులు ఉత్పత్తి చేసే సామర్థ్యం బీఈ లిమిటెడ్‌కు ఉన్నట్లు స్పష్టం చేశారు.

మధ్య ఆదాయ శ్రేణి దేశాలకు..

బేలర్స్‌తో ఒప్పందం వల్ల ముఖ్యంగా భారత్‌సహా ఇతర మధ్య ఆదాయ శ్రేణి దేశాలకు మేలైన టీకాను వేగవంతంగా అందించగలమని బీఈ లిమిటెడ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. వ్యాక్సిన్‌ అభివృద్ధి విజయవంతమైతే.. ఏడాదికి కొన్ని మిలియన్‌ డోసుల టీకాను అందుబాటులోకి తేగలమని వెల్లడించింది.

ఇదీ చూడండి:తొలిదశ పూర్తి చేసుకున్న మరో దేశీయ వ్యాక్సిన్​!

ABOUT THE AUTHOR

...view details