ఎలక్ట్రానిక్ దిగ్గజం ఆపిల్ సంస్థ నాలుగేళ్లకు ఐపాడ్‌లోని కొత్త సిరీస్‌ను విడుదల చేసింది. పూర్తిగా ఐఫోన్ ప్రత్యేకతలన్నీ ఏడో తరంలో రూపొందించిన ఐపాడ్ టచ్‌లో ఉంటాయి. ఫోన్‌కాల్స్‌కు మాత్రం అవకాశం లేదు. ప్రారంభ ధరను 199 డాలర్లుగా నిర్ణయించిన ఆపిల్.. 24 దేశాల్లో అందుబాటులోకి తెచ్చింది.
"చాలా సన్నగా, తక్కువ బరువు ఉండేలా ఈ ఐపాడ్ టచ్‌ను రూపొందించాం. గేమ్స్, మ్యూజిక్ ఇంకా చాలా అందుబాటులోకి తీసుకొచ్చాం. గతం కన్నా రెండు రెట్లు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఈ ఐపాడ్‌ను అందుబాటు ధరల్లోనే మార్కెట్లోకి తెచ్చాం."