దేశీయ క్యాబ్ సేవల సంస్థ 'ఓలా' అభివృద్ధి చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్(ఈ- స్కూటర్)లకు భారీగా క్రేజ్ పెరిగింది. కొత్తగా తెలుపు రంగు ఈ-స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ఆ సంస్థ సీఈఓ భవీష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. 'దీనిపై మీ అభిప్రాయమేంటి?' అని అడుగుతూ వైట్ ఓలా ఈ-స్కూటీ ఫొటోను షేర్ చేశారు.
అయితే.. ఇప్పటివరకు ఓలా ఈ-స్కూటర్ రేంజ్, బ్యాటరీ సైజ్, టాప్ స్పీడ్ మొదలైన అంశాలపై సంస్థ స్పష్టత ఇవ్వలేదు. కానీ, దేశీయ మార్కెట్లో ఈ స్కూటర్ విడుదలపై సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెలలోనే ఈ స్కూటర్ మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం.