తెలంగాణ

telangana

ETV Bharat / business

నీరవ్​ మోదీకి నాల్గో సారి బెయిల్​ నిరాకరణ

ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బెయిల్​ పిటిషన్​ను లండన్​ కోర్టు మరోమారు తిరస్కరించింది.

నీరవ్​ మోదీ

By

Published : Jun 12, 2019, 3:16 PM IST

పంజాబ్​ నేషనల్​ బ్యాంకు (పీఎన్​బీ) కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్​ కోర్టులో 4వ సారి చుక్కెదురైంది. ఆయన బెయిల్ అభ్యర్థనను తోసిపోచ్చుతూ వెస్ట్​మినిస్టర్​ కోర్టు తీర్పునిచ్చింది.

దాదాపు రూ. 13,000 కోట్ల కుంభకోణం కేసులో నీరవ్​ ప్రధాన నిందితుడు. మోసం వెలుగులోకి వచ్చేసరికి ఆయన లండన్​ పరారయ్యారు.

నీరవ్​ మోదీని అప్పగించాలని భారత్​​ చేసిన విజ్ఞప్తి మేరకు లండన్​ కోర్టు ఆయనపై ఆరెస్టు వారెంటు జారీ చేసింది.

మార్చి 19న స్కాట్​లాండ్ యార్డ్​​ అధికారులు నీరవ్​ను అదుపులోకి తీసుకున్నారు. నీరవ్​ను స్వదేశానికి రప్పించేందుకు భారత్​ విస్తృత ప్రయత్నాలు చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details