తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనాపై పోరుకు ట్విట్టర్​ బాస్​ భారీ విరాళం

కరోనా మహమ్మారిపై పోరుకు ట్విట్టర్​ సహ వ్యవస్థాపకుడు జాక్​ డోర్సీ భారీ విరాళం ప్రకటించారు. తన వ్యక్తిగత సంపదలో నుంచి 1 బిలియన్​ డాలర్లు స్టార్ట్​ స్మాల్​ స్వచ్ఛంద సంస్థకు అందిస్తున్నట్లు తెలిపారు.

Jack Dorsey
కరోనాపై పోరుకు ట్విట్టర్​ బాస్​ భారీ విరాళం

By

Published : Apr 8, 2020, 10:36 AM IST

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై పోరుకు ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్​ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జాక్​ డోర్సీ భారీ విరాళం ప్రకటించారు. తన వ్యక్తిగత సంపదలో నుంచి 1 బిలియన్​ డాలర్లు ఇస్తున్నట్లు ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

డోర్సీకి చెందిన డిజిటల్​ పేమెంట్స్​ గ్రూప్​ 'స్క్వేర్​'లోని షేర్లను స్వచ్ఛంద సంస్థ 'స్టార్ట్​ స్మాల్​'కు బదిలీచేస్తున్నట్లు తెలిపారు. ఆయన సంపదలో ఇది సుమారు 28 శాతం మేర ఉంటుంది. కరోనాపై పోరు కోసం ఓ వ్యక్తి ఇంత భారీ మొత్తం ప్రకటించటం ఇదే తొలిసారి.

" కరోనాపై పోరుకు సాయం చేసేందుకు ఇది ఇతరులకు ప్రేరణగా నిలుస్తుందని ఆశిస్తున్నా. జీవితం చాలా చిన్నది. ప్రజలకు సాయం చేసేందుకు మనం చేయగలిగినది ఈరోజే చేద్దాం. స్క్వేర్​లో నేను చాలా సంపద కలిగి ఉన్నా. ఈ డబ్బు వల్ల కలిగే ప్రభావం దీర్ఘకాలికంగా ప్రజలకు సేవ చేయాలనుకునే మా రెండు సంస్థలకు ప్రయోజనం చేకూర్చాలి. "

- జాక్​ డోర్సీ, ట్విట్టర్​ సహ వ్యవస్థాపకుడు.

వ్యాధి ప్రభావం తగ్గిన తర్వాత ఈ నిధులను బాలికల ఆరోగ్యం, విద్య, నిరుపేదల కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు డోర్సీ. లారెన్​ పావెల్​ ప్రారంభించిన 'అమెరికా ఆహార నిధి'కి సంబంధించిన పత్రాన్ని తన ట్వీట్​కు జత చేశారు డోర్సీ. ఆ నిధికి ఇప్పటికే లక్ష డాలర్లు సమకూరాయి.

జాక్​ డోర్సీ భారీ విరాళం

ఇతర సంస్థలు కూడా..

కరోనా వైరస్​పై పోరుకు ఇప్పటికే పలు సంస్థలు సాయం ప్రకటించాయి. అమెజాన్​ వ్యవస్థాపకుడు జెఫ్​ బెజోస్​ 100 మిలియన్​ డాలర్లును అమెరికాలోని అన్నార్తులకు ఆహారం అందించేందుకు సాయం చేశారు. బిల్​ అండ్​ మిలిందా గేట్స్​ ఫండేషన్​ ద్వారా పరిశోధనల కోసం ఫేస్​బుక్​ వ్యవస్థాపకుడు మార్క్​ జుకెర్​బర్గ్​ 25 మిలియన్​ డాలర్లు ప్రకటించారు. ఇదే నిధికి గత నెలలోనే గేట్స్​ ఫౌండేషన్​ 125 మిలియన్​ డాలర్లు విరాళంగా ఇచ్చింది.

ఇదీ చూడండి: ఆ విషయంలోనూ చైనా తర్వాతే అమెరికా

ABOUT THE AUTHOR

...view details