సామాజిక మాధ్యమాలు 'తీవ్ర విశ్వసనీయత సమస్య'ను ఎదుర్కొంటున్నట్లు మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ పేర్కొంది. ఈ నేపథ్యంలో తమ కంటెంట్ నియంత్రణ పద్ధతులను మరింత పారదర్శకంగా మార్చాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. యూజర్లకు మరింత నియంత్రణ ఇచ్చేందుకూ ప్రయత్నిస్తున్నట్లు తెలపింది.
"చాలా మంది మమ్మల్ని (సోషల్ మీడియాను) నమ్మరు అనే విషయాన్ని మేం అంగీకరిస్తున్నాం. ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా.. ఇటీవల ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది. అయితే మాకు మాత్రమే ఇది పరిమితం కాలేదు. ప్రతీ సంస్థ విశ్వసనీయత సమస్యను ఎదుర్కొంటోంది."
-జాక్ డోర్సే, ట్విట్టర్ సీఈఓ