తెలంగాణ

telangana

ETV Bharat / business

టిక్​టాక్ కొనుగోలు రేసులోకి ట్విట్టర్​! - టిక్​టాక్​ కొనుగోలుకు ట్విట్టర్​ ఆసక్తి

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్​కు పోటీగా టిక్​టాక్​​ కొనుగోలు రేసులో ట్విట్టర్ ప్రవేశించింది​. ఈ మేరకు టిక్​టాక్ మాతృసంస్థ బైట్​ డ్యాన్స్​తో ట్విట్టర్​ చర్చలు ప్రారంభించినట్లు ఓ అమెరికా వార్తా సంస్థ కథనంలో పేర్కొంది. అయితే ఈ అంశంపై ట్విట్టర్ అధికారికంగా​ స్పందించలేదు.

Twitter expressed interest in buying TikTok
టిక్​టాక్ కొనుగోలు రేసులో ట్విట్టర్

By

Published : Aug 9, 2020, 1:47 PM IST

టిక్​టాక్​ కొనుగోలుకు టెక్​ దిగ్గజాల మధ్య పోటీ పెరుగుతోంది. సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్..​ టిక్​టాక్ అమెరికా వ్యాపారాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. టిక్​టాక్​ కొనుగోలు కోసం దాని మాతృ సంస్థ బైట్​డ్యాన్స్​తో చర్చలు జరుపుతోన్న విషయం తెలిసిందే.

ఈ అంశంపై ట్విట్టర్​గానీ, బైట్​ డ్యాన్స్​గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ట్విట్టర్ సామర్థ్యాలపై అనుమానాలు..

అయితే టిక్​టాక్​ కొనుగోలుకు ట్విట్టర్​ ఆర్థిక సామర్థ్యం సరిపోతుందా అనే అంశంపై విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

టిక్​టాక్​ను విక్రయించేందుకు బైట్​డ్యాన్స్​కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్​ 15 వరకు గడువు విధించారు. దీనితో పాటు మైక్రోసాఫ్ట్ ఇప్పటికే బైట్​డ్యాన్స్​తో పలు దఫాల్లో చర్చలు జరిపింది. వీటన్నింటిని దాటుకుని ట్విట్టర్​ టిక్​టాక్​ను కొనుగోలు చేయడం సాధ్యమేనా అనే సందేహాలు వస్తున్నాయి.

ట్విట్టర్​ మార్కెట్ క్యాపిటల్ దాదాపు 30 బిలియన్ డాలర్లకు సమానంగా ఉంది. అయితే టిక్​టాక్​ను కొనుగోలు చేసేందుకు ట్విట్టర్​కు ఇవి సరిపోవని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. ఈ ఒప్పందం పూర్తవ్వలంటే ట్విట్టర్​ భారీగా నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని అంటున్నారు

ఒకవేళ ట్విట్టర్​ వాటాదారులతో ఈ విషయంపై చర్చించినా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న వ్యాపారాలపైనే దృష్టి సారించేందుకు మొగ్గు చూపుతారని విశ్లేషిస్తున్నారు.

మరోవైపు ట్విట్టర్​లో వాటాదారుగా ఉన్న సిల్వర్​లేక్​ సంస్థ మాత్రం టిక్​టాక్ కొనుగోలు కోసం నిధులు సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పలు వార్తలొస్తున్నాయి.

ఇదీ చూడండి:ఆన్​లైన్​కు మారిన ఇంక్యుబేటర్ల కార్యకలాపాలు

ABOUT THE AUTHOR

...view details