ట్విట్టర్ ఇండియా అధినేత మనీశ్ మహేశ్వరికి పదోన్నతి లభించింది. నూతన బాధ్యతలు స్వీకరించేందుకు ఆయన ట్విట్టర్ ప్రధాన కార్యాలయం ఉన్న శాన్ఫ్రాన్సిస్కోకు మకాం మార్చనున్నారు.
'మనీశ్ మహీశ్వరి ఇకపై గ్లోబల్ రెవెన్యూ స్ట్రాటజీ, ఆపరేషన్స్ విభాగ డైరెక్టర్గా పని చేయనున్నారు.' అని ట్విట్టర్ జపాన్, ఏషియా పసిఫిక్ విభాగ అధ్యక్షుడు యూ ససామోటో పేర్కొన్నారు.