సామాజిక మాధ్యమాలపై ఇటీవల పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా నకిలీ వార్తలు, విద్వేషం, రెచ్చగొట్టే, వివాదాస్పద సమాచారాన్ని అడ్డుకోలేకపోతున్నాయని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి తోడు ప్రముఖులపై చర్యల విషయంలోనూ సామాజిక మాధ్యమ సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో వాటన్నింటికీ చెక్ పెట్టేందుకు ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రజా నాయకులు, ఇతర ప్రముఖులకు కూడా సాధారణ యూజర్లలానే నిబంధనలు ఉండాలా? ఒకవేళ వారు నిబంధనలను అతిక్రమిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే విషయాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు వెల్లడించింది.