తెలంగాణ

telangana

By

Published : Mar 10, 2021, 5:33 PM IST

ETV Bharat / business

కొత్త మోడళ్లతో టీవీఎస్​, ఫోర్డ్​, బీఎండబ్ల్యూ సందడి

భారత్ మార్కెట్లోకి ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్​ అపాచీ కొత్త మోడల్​ను బుధవారం విడుదల చేసింది. ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఫోర్డ్ సరికొత్త ఎకోస్పోర్ట్స్​ ఎస్​యూవీని, బీఎండబ్ల్యూ.. మేడ్​ ఇన్ ఇండియా ఎం340ఐ ఎక్స్​డ్రైవ్ వేరియట్​ను అందుబాటులోకి తెచ్చాయి. ఈ కొత్త మోడళ్ల ధరలు, వాటి ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.

TVS Motor launches 2021 edition of Apache RTR
ఫోర్డ్ కొత్త ఎకోస్పోర్ట్స్ ధర

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్స్‌ 2021 ఎడిషన్​ అపాచీ ఆర్‌టీఆర్‌ 160 4వీ బైక్‌ను బుధవారం విడుదల చేసింది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. డిస్క్‌ వేరియంట్‌ ధర రూ.1,10,320 (ఎక్స్‌షోరూం, దిల్లీ), డ్రమ్‌ వేరియంట్‌ ధర రూ.1,07,270గా నిర్ణయించింది కంపెనీ.

రేసింగ్‌ రెడ్‌, నైట్‌ బ్లాక్‌, మెటాలిక్‌ బ్లూ-మొత్తం మూడు రంగుల్లో అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

అపాచీ 2021 ఎడిషన్​

ప్రత్యేకతలు..

  • 159.7 సీసీ సింగిల్‌ సిలిండర్‌, 4-వాల్వ్‌, ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌
  • 9,250 ఆర్‌పీఎం వద్ద 17.38 హెచ్‌పీ శక్తిని, 7,250 ఆర్‌పీఎం వద్ద 14.73 ఎన్‌ఎం టార్క్‌ని విడుదల చేస్తుంది
  • ఫైవ్‌ స్పీడ్‌ గేర్‌బాక్స్‌ కలిగిన ఈ బైక్‌ ఈ సెగ్మెంట్‌లో అత్యంత శక్తిమంతమైన రైడింగ్‌ అనుభూతిని ఇవ్వనున్నట్లు సంస్థ తెలిపింది.
  • ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌, క్లా స్టైల్డ్‌ పొజిషన్‌ ల్యాంప్‌లు ప్రత్యేక ఆకర్షణ.
  • పాత అపాచీల వెర్షన్‌లతో పోలిస్తే ఈ కొత్త బైక్‌ రెండు కిలోల బరువు తగ్గడం విశేషం.

ఎకో స్పోర్ట్​ కొత్త వేరియంట్..

భారత్​లో మంచి ఆదరణ దక్కించుకున్న ఎకోస్పోర్ట్స్‌ ఎస్​యూవీలో కొత్త వేరియంట్​ను ఫోర్డ్ ఇండియా బుధవారం విడుదల చేసింది. సిగ్నేచర్​ రియర్​మౌంట్​ వీల్​తో, వీల్​ లేకుండా రెండు వేరియంట్లలో ఈ మోడల్​ను అందుబాటులోకి తెచ్చింది ఫోర్డ్​.

సరికొత్త ఎకోస్పోర్ట్స్​ పెట్రోల్​ వేరియంట్ ధర (ఎక్స్​ షోరూం) రూ.10.49 లక్షలు, డీజిల్ వేరియంట్ ధర (ఎక్స్​ షోరూం) రూ.10.99 లక్షలుగా నిర్ణయించింది కంపెనీ.

సరికొత్త ఎకోస్పోర్ట్స్

ప్రత్యేకతలు..

  • పెట్రోల్ వేరియంట్​ 1.5 లీటర్​ ట్రిపుల్​ సిలిండర్​ 122 పీఎస్​ శక్తిని, 149 ఎన్​ఎం టార్క్​ను విడుదల చేసింది.
  • డీజిల్ వేరియంట్​ 1.5లీటర్ ఇంజిన్​తో 100 పీఎస్​ శక్తి, 215 ఎన్​ఎం టార్క్​ను విడుదల చేసింది.
  • 5-ఎంటీ-గేర్‌బాక్స్‌

మేడ్​ ఇన్​ ఇండియా ఎం340ఐ ఎక్స్​డ్రైవ్

లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఎం340ఐ ఎక్స్​డ్రైవ్​ వేరియంట్​ను భారత మార్కెట్లోకి విడుదల చేసినట్లు బుధవారం ప్రకటించింది. దీని ధర (ఎక్స్ షోరూం) రూ.62.9 లక్షలుగా నిర్ణయించింది. పూర్తిగా భారత్​లో తయారైన ఎం ఇంజిన్ తొలి​ వేరియంట్​ ఇదేనని బీఎండబ్ల్యూ వెల్లడించింది.

మేడ్​ఇన్​ ఇండియా ఎం340ఐ ఎక్స్​డ్రైవ్

ప్రత్యేకతలు..

  • 2,998 సీసీ సిక్స్​ సిలిండర్​ పెట్రోల్ ఇంజిన్​
  • 387 హార్స్​ పవర్, 50 ఎన్ఎం పీక్​ టార్క్​
  • 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.4 సెకన్లలో అందుకునే సామర్థ్యం
  • టాప్ స్పీడ్​ గంటకు 250 కిలోమీటర్లు
  • 8-స్పీడ్​ ఆటోమేటిక్ గేర్​బాక్స్

హోండా సీబీ 350 ఆర్​ఎస్​ డెలివరీ ప్రారంభం..

జపాన్‌కు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజం హోండా సీబీ 350 ఆర్‌ఎస్ బైక్​ల డెలివరీలు ప్రారంభించినట్లు బుధవారం ప్రకటించింది. భారత మార్కెట్లో ఇటీవల ఈ మోడల్​ను ఫిబ్రవరి 16న విడుదల చేసింది హోండా. ఈ బైక్ ధర(దిల్లీ ఎక్స్‌షోరూం)లో రూ.1.96లక్షలుగా నిర్ణయించింది కంపెనీ. దీనిలో ఆర్‌ఎస్‌ అంటే 'రోడ్‌ సెయిలింగ్‌' అని అర్థం.

రాయల్‌ ఎన్​ఫీల్డ్‌ మెటియోర్‌ 350, క్లాసిక్‌ 350, జావా ఫార్టీటూ వంటి బైక్​లకు పోటీగా సీబీ 350ఆర్​ఎస్​ను హోండా మార్కెట్లోకి తెచ్చింది.

ఇదీ చదవండి:మస్క్ సంపద ఒక్కరోజే రూ.1.8 లక్షల కోట్లు వృద్ధి

ABOUT THE AUTHOR

...view details