క్రికెట్ ప్రపంచ కప్ నేపథ్యంలో జూన్లో భారీగా పుంజుకున్నాయి టీవీల అమ్మకాలు. జులైలో మళ్లీ సాధారణ స్థాయికి చేరాయి. టీవీ పరిశ్రమల వర్గాలు వెల్లడించిన ఇటీవలి గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
క్రెకెట్ మానియాతో జూన్ అమ్మకాలు భారీగా ఉన్నా.. సీజన్ ముగిసిన తర్వాత కొనుగోళ్లకు మొగ్గు చూపడం లేదు వినియోగదారులు. అధిక ధరల నేపథ్యంలో కొనుగోళ్లు తగ్గినట్లు భావిస్తున్నాయి పరిశ్రమ వర్గాలు. ఈ నేపథ్యంలో టీవీలపై జీఎస్టీని తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.