ప్రస్తుతం ఇంగ్లాండ్లో జరుగుతున్న ప్రపంచకప్లో భారత జట్టు ఆటతీరు ఆకట్టుకుంటోంది. జట్టుపై అభిమానులే కాకుండా... టీవీల తయారీదారులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రపంచ కప్ ముగిసే నాటికి కనీసం 20 శాతం అమ్మకాలు పెంచుకోవాలని భావిస్తున్నారు.
"ప్రపంచ కప్లో భాగంగా భారత్-పాక్ మధ్య గత ఆదివారం మ్యాచ్ జరిగింది. మ్యాచ్కు వారం ముందు టీవీల అమ్మకాలు భారీగా వృద్ధి చెందాయి. ఇందుకు కచ్చితంగా ఆ మ్యాచ్కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. భారత్ ఆటతీరు ఇక ముందు కూడా ఆకట్టుకుంటుందని భావిస్తున్నాం. దీని కారణంగా దేశంలో టీవీలకు గిరాకీ పెరుగుతుంది."
---సునీల్ నాయర్, సోనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్