టిక్‌టాక్ అమెరికా వ్యాపారాలను నిర్వహించేందుకు టెక్దిగ్గజం ఒరాకిల్, రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ మధ్య ఒప్పందం కుదిరే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇందుకు తాము పూర్తి సహకారం అందించనున్నట్లు వెల్లడించారు. టిక్‌టాక్‌ను ఆదివారం నుంచి అమెరికాలో నిషేధించాలని ఇటీవల ఆదేశాలు వెలువడిన తర్వాత ట్రంప్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఒప్పందం ఇలా..
ఈ ఒప్పందం ప్రకారం.. టిక్‌టాక్ కార్యకలాపాలను నిర్వహించేందుకు టెక్సాస్ కేంద్రంగా కొత్త కార్పొరేట్ సంస్థను నెలకొల్పనున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ ద్వారా దాదాపు 25 వేల కొత్త ఉద్యోగాల కల్పన కూడా జరగనున్నట్లు ట్రంప్ తెలిపారు. అమెరికా యువత విద్య కోసం టిక్‌టాక్‌ను 5 బిలియన్ డాలర్ల విరాళం కూడా కోరినట్లు పేర్కొన్నారు.
ఈ కంపెనీ డేటా స్టోరేజీకి ప్రత్యేక క్లౌడ్‌ను వాడనున్నట్లు తెలిపారు ట్రంప్. దీనితో యూజర్ల డేటాకు 100 శాతం భద్రత ఉంటుందని భరోసా ఇచ్చారు.