తెలంగాణ

telangana

ETV Bharat / business

బల్క్​ ఎస్​ఎంఎస్ నిబంధనల అమలుపై ట్రాయ్ లేఖ - ట్రాయ్​ లేటెస్ట్ న్యూస్

బల్క్​ ఎస్​ఎంఎస్​లకు సంబంధించి ఏప్రిల్​ 1 నుంచి అమలు చేయనున్న కొత్త నిబంధనల అమలుకు సహకరించాలని.. టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్​) వివిధ మంత్రిత్వ శాఖలు, పరిశ్రమ సంఘాలకు లేఖ రాసింది. ఈ విషయంలో ట్రాయ్​కు పూర్తిగా సహకరిస్తామని ఎన్​ఐసీ హామీ ఇచ్చినట్లు తెలిసింది.

Trai new SMS regulations
ట్రాక్​ కొత్త ఎస్​ఎంఎస్​ నిబంధనలు

By

Published : Mar 28, 2021, 6:07 PM IST

బల్క్​ ఎస్​ఎంఎస్​లకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి నూతన నియంత్రణ నిబంధనలు అమలు చేయనుంది టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్​). ఈ నేపథ్యంలో కొత్త నిబంధనల అమలు.. సజావుగా సాగేలా చూడాలని వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు, ప్రభుత్వేతర సంఘాలకు, నోడల్ ఏజెన్సీలకు లేఖ రాసింది.

వాణిజ్య సందేశాల కోసం తెస్తున్న కొత్త నిబంధనలకు సంబంధించి ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీల మధ్య సమన్వయం కుదుర్చుకుంటూ.. ఏవైనా సమస్యలు వస్తే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్​ఐసీ హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఎన్​ఐసీ.. పరిపాలనా విధానాలకు సాంకేతికతను అందిస్తుంటుంది.

సీఐఐ, ఫిక్కీ, నాస్కామ్​, సెల్యులార్ అసోసియేషన్​ ఆఫ్ ఇండియా (కాయ్​) వంటి సంఘాలు తమ సభ్యులకు కొత్త నిబంధనల గురించి వివరించాలని ట్రాయ్​ కోరింది.

ఏమిటి కొత్త నిబంధనలు..

అవాంఛిత, మోసపూరిత సందేశాలకు చెక్‌ పెట్టేందుకు ట్రాయ్‌ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వినియోగదారులకు వాణిజ్య సందేశాలు పంపే సంస్థలు మెసేజ్‌ హెడ్డర్‌, టెంప్లేట్స్‌ను టెలికాం ఆపరేటర్ల వద్ద రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సదరు సంస్థ నుంచి వచ్చే ఎస్​ఎంఎస్​ గానీ, ఓటీపీ గానీ అంతకుముందు రిజిస్టరైన వివరాలతో బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ ఆధారంగా టెలికాం సంస్థలు సరిపోల్చుతాయి. దీన్నే ఎస్​ఎంఎస్ స్క్రబ్బింగ్‌ అంటారు.

ఇదీ చదవండి:కరోనాలోనూ కేఎఫ్​సీ విస్తరణ- కొత్తగా 30 రెస్టారెంట్లు!

ABOUT THE AUTHOR

...view details