కార్ల తయారీ దిగ్గజం టొయోటా ఎగిరే ఎలక్ట్రిక్ కార్ల వాణిజ్య ఉత్పత్తిపై దృష్టి పెట్టింది. వేగవంతమైన, సౌకర్యవంతమైన, అందుబాటు ధరల్లో గగనతల ప్రయాణం కోసం 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది.
గగనతల ప్రయాణం.. టొయోటా దీర్ఘకాలిక లక్ష్యమన్న ఆ సంస్థ అధ్యక్షుడు అకియో టొయోడా ఆటోమోబైల్ వ్యాపారం కొనసాగిస్తూనే, ఎగిరేకార్ల ఉత్పత్తిపై దృష్టిసారిస్తామన్నారు. ఈ పెట్టుబడుల ద్వారా వినియోగదారులు భూమి మీదే కాకుండా నింగిలోనూ స్వేచ్ఛగా ఎగిరే అవకాశం కల్పిస్తామని టొయోటా వెల్లడించింది.