తెలంగాణ

telangana

ETV Bharat / business

'మొత్తం మీరే చేశారు'.. అమెజాన్​పై బియానీ ఫైర్ - అమెజాన్​పై కిశోర్​ బియానీ విమర్శలు

అమెజాన్​, ఫ్యూచర్​ రిటైల్ గ్రూప్​ల మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఇరు పక్షాలు లేఖాస్త్రాలతో విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా అమెజాన్​ నిర్లక్ష్య వైఖరి వల్లే తాము రిలయన్స్ రిటైల్​తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఫ్యూచర్ గ్రుప్ వ్యవస్థాపకుడు కిశోర్ బియానీ పేర్కొన్నారు.

Amazon Future Retail issue
అమెజాన్​, ఫ్యూచర్ రిటైల్ వివాదం

By

Published : Jan 5, 2021, 4:38 PM IST

అమెజాన్​, నిర్లక్ష్య వైఖరితో విసిగిపోయామని ఫ్యూచర్​ గ్రూప్ వ్యవస్థాపకుడు కిశోర్ బియానీ అన్నారు. అందువల్లే రిలయన్స్ ఆఫర్​ను అంగీకరించడం తప్ప తమ ముందు వేరే మార్గం లేకుండా పోయిందని వివరించారు. అమెజాన్ పంపిన నోటీసులకు కిశోర్ బియానీ ఈ విధంగా స్పందించారు.

కిశోర్​ బియానీ, ఫ్యూచర్​ గ్రూప్ వ్యవస్థాపకుడు

అందుకు అమెజాన్​ది మాత్రమే బాధ్యత..

రిలయన్స్ దేశంలోనే కాదు ప్రపంచంలోనూ అతిపెద్ద కంపెనీల్లో ఒకటని.. ప్రస్తుతం ఫ్యూచర్ గ్రూప్​లోని వివిధ కంపెనీలను గట్టెక్కించి.. ఉద్యోగుల, వాటాదారుల, రుణదాతల, ప్రమోటర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఇంతకన్నా మంచి ఆవకాశం ఉండదనే ఉద్దేశంతోనే ఒప్పందం కుదుర్చుకున్నట్లు బియానీ స్పష్టం చేశారు. ఫ్యూచర్ రిటైల్(ఎఫ్ఆర్​ఎల్​)​ను కాపాడటంలో విఫలమవడం వల్ల నెలకొన్న పరిస్థితులకు అమెజాన్ మాత్రమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.

ప్రమోటర్లు వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుంటున్నట్లు అమెజాన్ చేసిన ఆరోపణలనూ కిశోర్ బియానీ తోసిపుచ్చారు. అవన్నీ నిరాధారమైన ఆరోపణలేనని స్పష్టం చేశారు.

'2020 మార్చి నుంచి ఆగస్టు వరకు మీరు తీసుకున్న ప్రయత్నాల్లో విశ్వాసం లోపించింది. కేవలం మాటల వరకే మీ చర్యలు పరిమితమయ్యాయి. నిజమైన ప్రయత్నాలేవీ మీరు చేయలేదు. ఆ సమయంలో ప్రమోటర్లకు దన్నుగా నిలవాలనే ఆలోచన కానీ, భవిష్యత్​లో ఎఫ్​ఆర్​ఎల్​ షేర్లు పతనం కాకుండా చూసుకోవాలని కానీ మీకు ఏమాత్రం లేదు. ప్రమోటర్లకు వాళ్ల పని సులభతరం చేస్తున్నామని నమ్మించడం తప్ప మీరు చేసిందేమీ లేదు.' అని అమెజాన్​కు ఘాటుగా సమాధానమిచ్చారు బియానీ.

"రిలయన్స్​తో లావాదేవీ పూర్తవకపోతే.. ఫ్యూచర్ రిటైల్ దివాలా తీయడం అనివార్యమయ్యేది. అదే జరిగేతే ఈక్విటీ మొత్తం తుడిచి పెట్టుకుపోయేది. అప్పుడు అమెజాన్​ నుంచి విడిపోయినా మాకేం మిగిలేది కాదు."

- కిశోర్​ బియానీ

ఫ్యూచర్​ రిటైల్​ను ప్రమోటర్ల సెక్యూరిటీలు అన్యాక్రాంతం కాకుండా.. వివిధ రకాల ప్రత్యామ్నాయాలను అమెజాన్ ముందుంచినట్లు కిశోర్ బియానీ వెల్లడించారు. ఎఫ్​ఆర్​ఎల్​లో ఆదనంగా రూ.1,11,470 కోట్లు పెట్టుబడి పెట్టి.. వాటాను 4.8 శాతం నుంచి 19.1 శాతానికి పెంచుకోవాలని కూడా సూచించినట్లు వెల్లడించారు. అయితే ఎఫ్​డీఐల సాకుతో అందుకు కూడా అమెజాన్ అంగీకరించలేదని గుర్తు చేశారు.

ఇదీ చూడండి:అమెజాన్​ అధినేత ఉదారత- దాతృత్వంలోనూ టాప్​ ​

ABOUT THE AUTHOR

...view details